ఫ్రాంచైజీలు తమ రిటైన్డ్ ప్లేయర్ జాబితాలను సమర్పించేందుకు అక్టోబర్ 31ని గడువుగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఐపీఎల్ 2025 కోసం ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ఆరుగురినినేరుగా రిటైన్ చేసుకోవచ్చు, లేదా ఆర్‌టీఎమ్ కార్డ్‌తో వేలంలో దక్కించుకోవచ్చు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు దాదాపుగా తమ రిటైన్ లిస్ట్‌ను ఖరారు…
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈసారి ఆరుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ఫ్రాంఛైజీలకు ఇప్పటికే ఐపీఎల్ పాలక వర్గం అనుమతించింది. ఇందులో ఒక రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) ఉంటుంది. రిటైన్ జాబితాను ప్రకటించడానికి అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ ప్లేయర్ల లిస్ట్‌ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉన్నా.. ఇప్పటివరకు ఏ జట్టు కూడా అధికారికంగా జాబితాను విడుదల చేయలేదు. అయితే రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకుందని…
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. ప్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను అక్టోబర్ 31 లోపు సమర్పించాల్సి ఉంది. తుది గడువుకు మరికొన్ని గంటలే ఉన్న నేపథ్యంలో అభిమానుల దృష్టి అంతా రిటెన్షన్ జాబితాపైనే ఉంది. ఏ ప్రాంచైజీ ఏయే ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటుంది, ఎవరిని వేలంలోకి వదిలేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తుది గడువు సమీపిస్తున్నా కొద్దీ.. స్టార్ ఆటగాళ్ల చుట్టూ పలు ఆసక్తికర కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి…
టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి షమీని వదిలేందుకు సిద్దమైందని సమాచారం. గుజరాత్ రిటైన్ లిస్టులో షమీ పేరు లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చీలమండ గాయం కారణంగా ఏడాదికి పైగా షమీ ఆటకు దూరమవడంతోనే గుజరాత్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహహ్మద్ షమీ చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాదిలో ఒక్క…
ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం జరగనుంది. వేలంకు సంబందించిన రిటెన్షన్ పాలసీని ఐపీఎల్ పాలక మండలి ఇప్పటికే ప్రకటించింది. ఆర్‌టీఎంతో కలిసి మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లను తీసుకోవాలి. విదేశీ ఆటగాళ్ల విషయంలో ఎలాంటి పరిమితులు లేవు. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రాంఛైజీలు అక్టోబరు 31లోపు సమర్పించాలి. తుది గడువుకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండడంతో ఇప్పటికే…
ఫ్రాంఛైజీల విజ్ఞప్తి మేరకు ఈసారి ఆర్‌టీఎంతో కలిసి మొత్తంగా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఐపీఎల్ పాలక మండలి అనుమతిని ఇచ్చింది. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను అక్టోబరు 31లోపు సమర్పించాలి. గడువుకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో కొన్ని జట్ల రిటైన్ లిస్ట్ బయటికి వస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ నుంచి ఓ బిగ్ అప్‌డేట్ వచ్చింది. స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను గుజరాత్ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుందట. గిల్‌తో పాటు మిస్టరీ…
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలంకు సంబంధించిన రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చు. ప్రాంచైజీలు రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ ప్రాంచైజీ ఎవరిని రిటైన్ చేసుకుంటుందో అని ఆసక్తిగా మారింది. అయితే డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కేకేఆర్ కేవలం నలుగురు…
ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం జరగనుంది. వేలంకు సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. ఈసారి ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి మరో మూడు రోజుల మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) ఫ్రాంచైజీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఊహించినట్లుగానే లక్నో తమ కెప్టెన్ కేఎల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్‌ను గెలవలేదు. 2016లో ఫైనల్ చేరినా తృటిలో టైటిల్ మిస్ అయింది. ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ ఓడి ఇంటిదారి పట్టింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ఆర్‌సీబీ చూస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కీలక ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 31వ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉంది.…
గోవాలో జరిగిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను క్రికెట్‌ను ఆస్వాదిస్తూ ఆడితే జట్టుకు, వ్యక్తిగతంగాను ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.