ఐపీఎల్ 2025 మెగా వేలం డేట్స్ వచ్చేశాయి. నవంబర్ 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలంను బీసీసీఐ నిర్వహించనుంది. మెగా వేలంకు మోతగం 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1,165 మంది భారత క్రికెటర్లు కాగా.. 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా దక్షిణాఫ్రికా నుంచి 91 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియా నుంచి 76 మంది, ఇంగ్లండ్ నుంచి 52 మంది, న్యూజిలాండ్ నుంచి 39 మంది వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Also Read: Prabhas-Spirit: ‘స్పిరిట్’ మూవీ అప్‌డేట్.. షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే?
42 ఏళ్ల ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐపీఎల్ 2025 మెగా వేలంకు తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆడని అండర్సన్.. 2014లో చివరగా టీ20 మ్యాచ్ ఆడాడు. గత జులైలో తన అంతర్జాతీయ చివరి మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం జిమ్మీ ఇంగ్లండ్ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్నాడు. అండర్సన్ రిటైర్మెంట్ అనంతరం ఐపీఎల్‌పై ఆసక్తి చూపడం ఇక్కడ విశేషం. జిమ్మీ ఇంగ్లండ్ తరఫున 188 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20లు ఆడాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్స్ (704) పడగొట్టిన పేస్ బౌలర్ అండర్సన్ అన్న విషయం తెలిసిందే. వేలంలో జిమ్మీకి భారీ ధర ఖాయం అని చెప్పాలి. అతడి కనీస ధర రూ.1.50 లక్షలు. అయితే ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ మెగా వేలంలో తన పేరును నమోదు చేసుకోలేదు.