RR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా నేడు గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో నితీశ్ రాణా (81) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లో 10…
ఐపీఎల్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. బ్యాటర్లు సిక్సులు, బౌండరీలతో చెలరేగుతుంటే.. బౌలర్లు డాట్ బాల్స్‌తో పాటు వికెట్లు తీసుకుంటున్నారు. అయితే.. బౌలర్లు ఎక్కువ వికెట్లు సాధిస్తే వారికి పర్పుల్ క్యాప్ అందించి ప్రోత్సహిస్తున్నారు. దీంతో.. బౌలర్లు తమ సత్తాను చాటుతున్నారు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ జరగనుంది. గౌహతీలోని బర్సపర క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2025లో భాగంగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయసంగా ఛేదించింది.
SRH vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలెట్టిన ఎస్‌ఆర్‌హెచ్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక సమయలో కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఇక మొత్తానికి హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ…
SRH Ugadi Wishes: నేడు వైజాగ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇదిలా ఉండగా.. నేడు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఘనంగా ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తాజాగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియా…
SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ రేపాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య ఆదివారం విశాఖ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో మళ్లీ హోరాహోరీ సమరానికి తెరలేచింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో…
ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పేరు అటు సోషల్ మీడియాలో, ఇటు టీవీల్లో మార్మోగిన విషయం తెలిసిందే. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ తమను దారుణంగా హింసిస్తోందని, వేధింపులు ఇలానే కొనసాగితే హైదరాబాద్ నగరాన్ని ఫ్రాంఛైజీ వీడిపోవడానికి సిద్ధంగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఓ లేఖ రాసినట్లు న్యూస్ చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలపై హెచ్‌సీఏ అధికార ప్రకటన విడుదల చేసింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘ఎస్‌ఆర్‌హెచ్‌యాజమాన్యం…
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హార్దిక్‌కు జరిమానా పడింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి రూ.12 లక్షలు ఫైన్‌ను ఐపీఎల్ విధించింది. ఈ సీజన్‌లో తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల జరిమానా విధించాం అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ…
క్రికెట్ ఆటలో గొడవలు, దూషణలు సాధారణం. ముఖ్యంగా మ్యాచ్ రసవత్తరంగా ఉన్న సమయాల్లో ప్లేయర్స్ మాటలు యుద్దానికి దిగుతుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతి చేశాడు. ముంబై మాజీ ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ సాయి కిశోర్‌ను ముందు దూషించి.. ఆపై హగ్ ఇచ్చాడు. ఇందుకు సంభందించిన…