ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ మధ్యాహ్నం 3.30కి ఆరంభం కానుంది. గత మ్యాచ్‌లో లక్నోపై గెలిచిన ఢిల్లీ ఫుల్ జోష్‌లో ఉంది. అదే ఊపును ఎస్‌ఆర్‌హెచ్‌పై కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో గెలిచిన సన్‌రైజర్స్.. లక్నోపై ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మంచి విజయంతో మరలా పుంజుకోవాలని చూస్తోంది. లక్నోతో మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం…
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో 450 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ ఈ ఫీట్ సాధించాడు. ఏప్రిల్ 2007లో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు తరపున రోహిత్ టీ20 అరంగేట్రం చేశాడు. 18 ఏళ్లుగా టీ20 ఫార్మాట్ ఆడుతున్న హిట్‌మ్యాన్.. 450 మ్యాచ్‌ల మైలురాయి అందుకున్నాడు. టీ20…
నిత్యం వివాదాల్లో నిలిచే హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఉచిత టిక్కెట్ల కోసం హెచ్‌సీఏ ఉన్నతాధికారులు, ముఖ్యంగా అధ్యక్షుడు జగన్ మోహన్ రావు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)ను బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తుండడంతో ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంఛైజీ హైదరాబాద్ నగరాన్ని వీడిపోతామని హెచ్చరించింది. ఐపీఎల్ 2025 సందర్భంగా కోరినన్ని ఫ్రీ పాస్‌లు ఇవ్వనందుకు ఓ మ్యాచ్‌లో తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్స్‌కు తాళాలు వేసినట్లు సన్‌రైజర్స్ ప్రతినిధి ఒకరు హెచ్‌సీఏ కోశాధికారికి లేఖ రాసినట్లు తెలుస్తోంది.…
ఐపీఎల్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 36 పరుగుల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. చివరి వరకు పోరాడి ఓడిపోయింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ భారీ అంచనాల మధ్య ప్రారంభమైంది. 18వ సీజన్‌లో 10 జట్లు ట్రోఫీ గెలవడానికి పోటీపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తమ అభిమాన జట్ల విజయాన్ని ఆస్వాదిస్తూ ఉత్సాహంగా ఈ క్రికెట్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో కొత్త రికార్డులు నమోదవుతూ పాత రికార్డులు బద్దలవుతున్నాయి. అయితే, ఐపీఎల్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. అదేంటంటే.. ఐపీఎల్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి ఎంఎస్ ధోని మరింత సహకారం అందించగలడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ధోని జట్టుకు తక్కువ ఉపయోగం అవుతున్నారు.. అతను మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మంజ్రేకర్ సూచించాడు.
ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ జట్టులోకి చేరే అవకాశం ఉంది. తనకు కూతురు పుట్టిన కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు రాహుల్ దూరంగా ఉన్నాడు. అయితే.. మార్చి 30న వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశముందని ఆ జట్టు ఆటగాడు విపరాజ్ నిగమ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో భాగంగా తొమ్మిదవ మ్యాచ్ శనివారం గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో.. జట్టుకు మరింత బలం చేకూరనుంది.