ఐపీఎల్ 2025లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ జరగనుంది. గౌహతీలోని బర్సపర క్రికెట్ స్టేడియం వేదికగా కాసేపట్లో ప్రారంభం కానుంది. అందులో భాగంగా.. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్.. రెండింట్లో ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఈ మ్యాచ్‌లో గెలువాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ మొదటి మ్యాచ్ ముంబైపై విజయం సాధించినప్పటికీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో.. ఎలాగైనా మ్యాచ్ గెలువాలని చూస్తోంది. ఈ రెండు జట్లు ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం చివరి 3 స్థానాల్లో ఉన్నాయి. అందువల్ల ఈ మ్యాచ్ రెండు జట్లకూ చాలా కీలకమైనది. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌ను గెలిచి వారి సమర్ధతను నిరూపించుకోవాలని చూస్తున్నారు.
Read Also: DC vs SRH: సన్‌రైజర్స్ ఘోర పరాజయం.. ఢిల్లీ విక్టరీ
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్:
యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్మైర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ.
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:
రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, జామీ ఓవర్టన్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ.