ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లలో హార్డ్ హిట్టర్లు ఉండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్.. మరో విజయంపై కన్నేసింది. మరోవైపు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ దాంట్లో ఓడి, మరోదాంట్లో విజయం సాధించిన లక్నో..…
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్ 31న దుబాయ్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020 జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2023 ఫిబ్రవరి 14న హార్దిక్, నటాషాలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ ప్యాలెస్‌లో రెండోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు రావడంతో 2024…
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఆడిన మూడు మ్యాచ్‌లలో హిట్‌మ్యాన్ 21 పరుగులు మాత్రమే చేశాడు. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న రోహిత్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రోహిత్ ఫామ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ స్పందించాడు. రోహిత్ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడని, ఈ స్థానంలో మరో ఆటగాడు…
టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 8 వేల పరుగుల మార్కును అందుకున్న ఐదవ భారత ఆటగాడిగా సూరీడు నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ 9 బంతుల్లో 27 పరుగులు చేయడంతో ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనాలు సూర్య కంటే ముందున్నారు. సూర్యకుమార్…
ఇటీవలి కాలంలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పెద్దగా ఫామ్‌లో లేడు. టీమిండియా తరఫున అయినా, ఐపీఎల్‌లో అయినా అడపాదడపా ఇన్నింగ్స్ తప్పితే.. నిలకడగా రాణించిన దాఖలు లేవు. ఐపీఎల్ 2025లోనూ హిట్‌మ్యాన్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో 21 పరుగులు మాత్రమే చేశాడు. గుజరాత్‌పై 8, చెన్నైపై 0, కోల్‌కతాపై 13 రన్స్ చేశాడు. ఈ మూడు ఇన్నింగ్స్‌లలో రోహిత్ ఫాస్ట్ బౌలర్‌కు వికెట్స్ ఇవ్వడం విశేషం. గత…
ముంబై ఇండియన్స్ యువ బౌలర్ అశ్వని కుమార్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన అశ్వని కుమార్ 4 వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 3 ఓవర్లలో 4 వికెట్స్ తీసి 24 రన్స్ ఇచ్చాడు. అజింక్యా రహానే, రింకూ సింగ్,…
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో దిగువన వస్తున్న విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌లో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్ పోరులో చెన్నైకి 25 బంతుల్లో 54 పరుగులు అవసరమైనపుడు 7వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. మహీ 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో చెన్నై 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మరీ దిగువన వస్తుండడంపై…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ మరో రికార్డు నెలకొల్పింది. ఒకే వేదికలో ఒకే ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా ముంబై నిలిచింది. వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఇప్పటివరకు ముంబై 10 విజయాలు నమోదు చేసింది. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా సోమవారం వాంఖడే స్టేడియంలో కోల్‌కతాపై విజయం సాధించడంతో ముంబై ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాతి స్థానంలో కోల్‌కతా నైట్…
MI vs KKR: ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025 సీజన్ లో బోణి కొట్టింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ చేపట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ కేవలం 16.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై ఇండియన్స్ బౌలర్ అశ్విని కుమార్ 24 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో కోల్కతా నైట్ రైడర్స్ తక్కువ…
MI vs KKR: ఐపీఎల్‌లో పలు అద్భుతాలు సృష్టించిన కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నేడు ముంబై వేదికగా నిరాశపరిచింది. ఇక మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కోల్కతా నైట్‌రైడర్స్ మొదట బ్యాటింగ్ చేపట్టింది. ఇక మ్యాచ్ మొదటి ఓవర్ నుండే వికెట్లు కోల్పోయిన కోల్కతా నైట్ రైడర్స్ చివరకు 16.2 ఓవర్లలో 116 పరుగులకు ఆలౌటై అభిమానులను నిరాశపరిచింది. ఇక కేకేఆర్ బ్యాటింగ్‌లో తొలి నుంచే కష్టాలు…