SRH vs DC: ఐపీఎల్ 2025లో భాగంగా వైజాగ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ మొదలెట్టిన ఎస్‌ఆర్‌హెచ్ కు ఏమాత్రం కలిసి రాలేదు. ఆదిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒక సమయలో కేవలం 37 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఇక మొత్తానికి హైదరాబాద్ జట్టు 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఢిల్లీ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరచడంతో హైదరాబాద్ బ్యాటింగ్ విఫలమైంది. మ్యాచ్ ప్రారంభంలోనే వరుస వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ ఆ తర్వాత అనికేత్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును ముందుకు నడిపాడు.
Read Also: Chhattisgarh: మోడీ టూర్‌కు ముందు కీలక పరిణామం.. 50 మంది మావోలు లొంగుబాటు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (1) పరుగుకే రనౌట్ అవ్వగా, మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (22) మంచి ఆరంభాన్ని అందించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఇషాన్ కిషన్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (0) వరుసగా అవుట్ కావడంతో 2.3 ఓవర్లకే 25/3 స్కోరుతో హైదరాబాద్ కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో యువ ఆటగాడు అనికేత్ వర్మ (74) అద్భుతంగా రాణించాడు. కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 180.48 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయాడు. హెన్రిచ్ క్లాసెన్ (32) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
హైదరాబాద్ 163 పరుగులకు ఆలౌట్ అవ్వడానికి ప్రధాన కారణం ఢిల్లీ బౌలర్ల అద్భుత ప్రదర్శన. మిచెల్ స్టార్‌క్ 5 వికెట్లు తీసి హైదరాబాద్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. కుల్దీప్ యాదవ్ (3/22) తన స్పిన్ మాయాజాలంతో కీలకమైన వికెట్లు తీసి SRH టాప్ ఆర్డర్‌ను కూల్చేశాడు. మోహిత్ శర్మ ఒక వికెట్ నేలకూల్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 164 పరుగులు చేయాలి.