SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన కొన్ని మ్యాచ్‌లు ఉత్కంఠ రేపాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య ఆదివారం విశాఖ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో మళ్లీ హోరాహోరీ సమరానికి తెరలేచింది. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇటీవల లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరాశపరిచిన హైదరాబాద్, ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. జట్టులో ఒక్క మార్పుతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్, ప్రత్యర్థిని చిత్తు చేసే లక్ష్యంతో దిగుతోంది.
ఈ మ్యాచ్‌కు ఐసీసీ ఛైర్మన్ జై షా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, ఉప సభాపతి రఘురామ కృష్ణం రాజు హాజరుకానుండటంతో విశాఖ స్టేడియంలో భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ప్రముఖులు హాజరవ్వడం, అభిమానుల ఉత్సాహం దృష్ట్యా మైదానం చుట్టూ భారీ భద్రత కల్పించారు. సొంతగడ్డపై లక్నో చేతిలో పరాజయాన్ని చవిచూసిన సన్‌రైజర్స్, ఈ మ్యాచ్‌లో తిరిగి గెలుపుబాట పట్టాలని ఆశిస్తోంది. మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంచి ఊపులో ఉంది. లఖ్‌నవూపై విజయంతో గెలుపుబాట పట్టిన డీసీ ఆ జోష్‌ను కొనసాగించాలని చూస్తోంది. ముఖ్యంగా, కుమార్తె పుట్టుకతో తొలి మ్యాచ్‌కు దూరమైన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చేరడం ఢిల్లీకి అదనపు బలాన్ని అందించింది.
Read Also: NCRTC Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 75 వేల జీతం.. అర్హులు వీరే
ఇక ఇరుజట్ల తుది ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు (XI):
జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్‌దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముకేశ్ కుమార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్ :
సచిన్ బేబీ, ఇషాన్ మాలింగ, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపా, వీయాన్ ముల్డర్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (XI):
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హిన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్, జీషన్ అన్సారి, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్స్:
సచిన్ బేబీ, ఇషాన్ మాలింగ, సిమర్జీత్ సింగ్, ఆడమ్ జంపా, వీయాన్ ముల్డర్.