RR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా నేడు గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో నితీశ్ రాణా (81) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో రెచ్చిపోయిన రాణా హాఫ్ సెంచరీ చేసి జట్టును భారీ స్కోరు వద్ద నిలబెట్టాడు. అతనికి రియాన్ పరాగ్ (37) మంచి సహకారం అందించాడు.
Read Also: Home Minister Anita: క్యాన్సర్ పెషేంట్ తో విడియో కాల్ మాట్లాడిన హోం మంత్రి అనిత
అయితే, మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) త్వరగా అవుట్ కాగా, కెప్టెన్ సంజూ శాంసన్ (20) కూడా వెనుతిరిగాడు. ఇక ఓవర్లలో శిమ్రాన్ హెట్మైర్ (19) కాస్త పర్వాలేదనిపించాడు. ఇక చెన్నై బౌలర్ల విషయానికి వస్తే.. నూర్ అహ్మద్ (2/28), మతీషా పథిరానా (2/28) లు కాస్త కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. ఖలీల్ అహ్మద్ రెండు కూడా కీలకమైన వికెట్లు తీశాడు. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, అశ్విన్ చెరో ఒక వికెట్ తీశారు. దింతో, చెన్నై సూపర్ కింగ్స్ 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగనుంది.