SRH Ugadi Wishes: నేడు వైజాగ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపిఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇదిలా ఉండగా.. నేడు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఘనంగా ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తాజాగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also: Ugadi Rasi phalalu 2025: మేష రాశి వారు ఈ తప్పులు చెయ్యొద్దు!
ఈ వైరల్ వీడియోలో మొదటగా వైజాగ్ కు చెందిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తెలుగులో తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలపగా.. ఆ తర్వాత జట్టు ఆటగాళ్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హేన్రిచ్ క్లాసన్, హర్షల్ పటేల్, ఆడమ్ జంపా, అభిషేక్ శర్మ మరి కొంతమంది ఆటగాళ్లు వారి స్టైల్ లో తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ వీడియోకు సోషల్ మీడియాలో తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈరోజు జరిగే మ్యాచ్ లో మీరు విజయంతో మమ్మల్ని ఉత్సాహపరచాలని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు హ్యాపీ ఉగాది ఆరెంజ్ ఆర్మీ అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.