ఐపీఎల్ 18వ సీజన్‌లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ముంబై నాలుగు మ్యాచులు ఆడి.. కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండాలంటే.. ఇక నుంచి అయినా విజయాలు సాధించాలి. మరోవైపు బెంగళూరు మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిచి టాప్-3లో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. ఏకంగా అగ్రస్థానానికి చేరుకుంటుంది. ‘ఈసాలా…
ఐపీఎల్ 2025లో వరుసగా రెండు మ్యాచ్‌లలో లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠి జరిమానా ఎదుర్కొన్నాడు. వికెట్ తీయగానే ‘నోట్‌బుక్‌పై సంతకం’ చేసినట్లుగా సెలబ్రేషన్స్ చేసుకోవడమే ఇందుకు కారణం. మొదటిసారి రూ.12 లక్షల జరిమానా పడగా.. రెండోసారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది. అంతేకాదు అతడి ఖాతాలో మూడు డీ మెరిట్ పాయింట్లు కూడా చేరాయి. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌తో లక్నో మంగళవారం తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేసే…
టీమిండియా పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటనలో గాయపడ్డ బుమ్రా.. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకున్నాడు. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్‌నెస్ టెస్టులో పాసై.. ఆదివారం ముంబై జట్టుతో కలిశాడు. ఈరోజు ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోలను ముంబై ప్రాంచైజీ షేర్ చేసింది. ఈ…
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన సినిమాలు, డేటింగ్ విషయంలో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిస్తుంటారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌తో డేటింగ్ విషయంలో తరచుగా వార్తల్లో ఉంటారు. ఊర్వశి, పంత్ మధ్య సంథింగ్ అంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఊర్వశి కూడా ఓసారి తాను పంత్ కోసం చాలా సమయం వెయిట్ చేశానని స్వయంగా చెప్పారు. చాలాసార్లు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు సెటైర్లు కూడా వేసుకున్నారు. అయితే…
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాలుగు నెలల తర్వాత మైదానంలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నేడు జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా ఆడనున్నాడు. గత జనవరిలో గాయపడిన బుమ్రా.. ఆర్సీబీతో మ్యాచ్‌లోనే ఆడతాడని ఇప్పటికే ముంబై కోచ్ వెల్లడించాడు. బుమ్రా ఐపీఎల్ ఎంట్రీ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాడు టిమ్ డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా వేసిన…
టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ భారత జట్టు తరఫున ఆడి రెండేళ్లు గడుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 స్క్వాడ్‌లో ఉన్నా.. తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చోటే లేదు. ఏమాత్రం నిరాశ చెందని ఈ మణికట్టు స్పిన్నర్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన యూజీ.. ఈసారి పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని…
ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు వికెట్స్ పడగొట్టిన మహ్మద్ సిరాజ్‌పై గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. బౌలింగ్‌లో సిరాజ్ ఎనర్జీ సూపర్ అని, అద్భుతంగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. టీ20 ఫార్మాట్‌లో బ్యాటర్ల కంటే బౌలర్లే గేమ్ ఛేంజర్లు అని పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడని గిల్ చెప్పుకొచ్చాడు. ఉప్పల్ మైదానంలో ఆదివారం రాత్రి హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్…
ఏడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అడపాదడపా మెరుపులు తప్పితే.. నిలకడగా రాణించలేదు. ఇటీవలి కాలంలో టీమిండియా తరఫున కూడా పెద్దగా రాణించిన దాఖలు లేవు. దాంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్‌ను బెంగళూరు వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టుకు ఎంపిక కాని ఈ హైదరాబాద్ పేసర్.. ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు. ముఖ్యంగా ఉప్పల్ మైదానంలో…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మహీ.. కీపర్, బ్యాటర్‌గా సేవలందిస్తున్నాడు. తన సహచర ప్లేయర్స్ సురేష్ రైనా, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి వారు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. 43 ఏళ్ల ధోనీ ఇంకా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధోనీ.. తనకు ఎదురైన…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రెండు రోజుల క్రితం వార్తలొచ్చిన విషయం తెలిసిందే. శనివారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు వీక్షించడమే ఇందుకు కారణం. సాధారణంగా మహీ తల్లిదండ్రులు మ్యాచ్‌లు చూసేందుకు రారు. కానీ ఢిల్లీ మ్యాచ్‌కు రావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్…