IPL 2025: నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే: ఊర్వశి రౌతేలా
- సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఊర్వశి రౌతేలా
- మరోసారి ఊర్వశి, పంత్ పేర్లు చర్చకు
- నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన సినిమాలు, డేటింగ్ విషయంలో నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిస్తుంటారు. ముఖ్యంగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్‌తో డేటింగ్ విషయంలో తరచుగా వార్తల్లో ఉంటారు. ఊర్వశి, పంత్ మధ్య సంథింగ్ అంటూ గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఊర్వశి కూడా ఓసారి తాను పంత్ కోసం చాలా సమయం వెయిట్ చేశానని స్వయంగా చెప్పారు. చాలాసార్లు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు సెటైర్లు కూడా వేసుకున్నారు. అయితే ఐపీఎల్ 2025 సందర్భంగా మరోసారి ఇద్దరి పేర్లు చర్చకు వచ్చాయి.
ఐపీఎల్ 2025లో తన ఫేవరెట్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ అని ఊర్వశి రౌతేలా తెలిపారు. విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఐపీఎల్ 2025లో లక్నో టైటిల్ గెలవాలని తాను కోరుకుంటునట్లు చెప్పారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పిన ఊర్వశి.. ఇప్పుడు లక్నో అని చెప్పడానికి కారణం పంతే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జాట్’ ప్రమోషన్స్‌లో భాగంగా పంత్‌తో కలిసి పని చేయాలనుందనే తన కోరికను బయటపెట్టారు. పంత్‌తో యాడ్ చేయడం ఇష్టమేనా? అని ప్రశ్నకు ‘గతంలో నేను చాలా మంది క్రికెటర్లతో పని చేశాను. పంత్‌తో మాత్రం చేయలేదు. ఆ అవకాశం వస్తుందో లేదో తెలీదు. అది స్క్రిప్ట్‌పై ఆధారపడి ఉంటుంది’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఊర్వశి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
Also Read: MI vs RCB: బుమ్రా వేసిన తొలి బంతికే ఫోర్ లేదా సిక్స్ కొడతా: టిమ్ డేవిడ్
ఊర్వశి రౌతేలాకు క్రికెట్ అంటే పిచ్చి. టీమిండియా మ్యాచ్‌లకు తరచుగా ఆమె హాజరవుతుంటారు. భారత జట్టుకు తన మద్దతు తెలుపుతారు. ఊర్వశితో డేటింగ్ వార్తలను పంత్ కొట్టిపారేశాడు. అయినా కూడా సమయం, సందర్భం వచ్చినపుడు పంత్ పేరును ఊర్వశి ప్రస్తావిస్తుంటారు. ఇక ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఊర్వశి.. తెలుగులో వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేశారు. డాకు మహారాజ్ సినిమాలో కీలక పాత్రలో మెరిశారు.
Urvashi Rautela said, “I’m supporting RCB and Lucknow Supergiants in IPL 2025”. pic.twitter.com/Wbfjwjwc3v
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2025
తాజావార్తలు
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!