టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ భారత జట్టు తరఫున ఆడి రెండేళ్లు గడుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 స్క్వాడ్‌లో ఉన్నా.. తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చోటే లేదు. ఏమాత్రం నిరాశ చెందని ఈ మణికట్టు స్పిన్నర్ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన యూజీ.. ఈసారి పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతడిని రూ.18 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
పంజాబ్ కింగ్స్ ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో యజ్వేంద్ర చహల్ సత్తా చాటలేకపోయాడు. ధారాళంగా పరుగులిచ్చుకున్న యూజీ.. ఒక్క వికెట్టే మాత్రమే పడగొట్టాడు. దాంతో సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు వస్తున్నాయి. చహల్‌కు రూ.18 కోట్లు దండగ అని కొందరు కామెంట్స్ చేశారు. వీటికి యూజీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. రూ.18 కోట్లకు తాను అర్హుడినే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2025 మొదలై ఎన్నో రోజులు కాలేదని, ఇప్పుడిప్పుడే లయ అందుకుంటున్నా అని పేర్కొన్నాడు. ఒకసారి మైదానంలోకి దిగాక ఎంత ధర వచ్చింది, ఎంత నష్టపోయాం లాంటి విషయాలు ఆలోచించమని యూజీ చెప్పుకొచ్చాడు.
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు!
‘పంజాబ్ కింగ్స్ ఇపటివరకు మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. ఐపీఎల్ 2025 మొదలై ఎన్నో రోజులు కాలేదు. నేను ఇప్పుడే లయ అందుకుంటున్నా. నా ప్రదర్శన తర్వాత విషయం. ఒకవేళ నేను ఒక్క వికెట్ పడగొట్టకపోయినా పంజాబ్ కింగ్స్ టైటిల్ గెలిస్తే నేనేం బాధపడను. ఎందుకంటే నాకు జట్టు విజయం ముఖ్యం. మ్యాచ్ విజయం సమిష్టి కృషితో సాధ్యం. ఐపీఎల్ 2025లో నాకు దక్కిన ధరకు అర్హుడినే. ఒకసారి మైదానంలోకి దిగాక ఎంత ధర వచ్చింది, ఎంత నష్టపోయాం లాంటి విషయాలు పట్టించుకోము’ అని యజ్వేంద్ర చహల్ చెప్పుకొచ్చాడు.