టీమిండియా పేస్ సెన్సేషన్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. గత జనవరిలో ఆ్రస్టేలియా పర్యటనలో గాయపడ్డ బుమ్రా.. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స తీసుకున్నాడు. తాజాగా బీసీసీఐ మెడికల్ టీమ్ ఫిట్‌నెస్ టెస్టులో పాసై.. ఆదివారం ముంబై జట్టుతో కలిశాడు. ఈరోజు ముంబైలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగనున్నాడు. బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియోలను ముంబై ప్రాంచైజీ షేర్ చేసింది. ఈ వీడియోస్ చూసిన ఎంఐ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెట్స్ ప్రాక్టీస్ సందర్భంగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు పేస్ సెన్సేషన్ బుమ్రాకు స్వాగతం పలికారు. ఈ సమయంలో ఎంఐ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్.. బుమ్రాను ఎత్తుకుని తిరగిరా తిప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ‘పొలార్డ్.. హ్యాండిల్ విత్ కేర్. ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ఉంది’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘పొలార్డ్ ఎత్తుకోవద్దు. మళ్లీ బుమ్రాకు ఏదైనా జరిగితే భారీ నష్టం చెల్లించుకోవాల్సి వస్తుంది’, ‘చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగాడు, జర భయపెట్టకండి సార్’, ‘బుమ్రాను మళ్లీ రిటైర్ చేయడానికి చేయడానికి ట్రై చేయకండి’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
Also Read: IPL 2025: నా ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ అదే: ఊర్వశి రౌతేలా
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో ఒక విజయం మాత్రమే సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఎనిమిదో స్థానంలో ఉంది. జస్ప్రీత్ బుమ్రా రాకతో ముంబై విజయాల బాట పడుతుందని ఫాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్ జట్టులో ఉన్నా ఆశించిన మేర రాణించడం లేదు. బుమ్రా అండతో వారిద్దరూ చెలరేగే అవకాశం ఉంది.
Kieron Pollard special welcome for Jasprit Bumrah 😂💙pic.twitter.com/uaw2MGkwVH
— R A T N I S H (@LoyalSachinFan) April 6, 2025