MS Dhoni Retirement: ఐపీఎల్ రిటైర్మెంట్.. క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోనీ!
- ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్
- చెన్నై, ఢిల్లీ మ్యాచ్‌కు ధోనీ తల్లిదండ్రులు
- రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ఎంఎస్ ధోనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని రెండు రోజుల క్రితం వార్తలొచ్చిన విషయం తెలిసిందే. శనివారం చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను ధోనీ తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకి దేవిలు వీక్షించడమే ఇందుకు కారణం. సాధారణంగా మహీ తల్లిదండ్రులు మ్యాచ్‌లు చూసేందుకు రారు. కానీ ఢిల్లీ మ్యాచ్‌కు రావడంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే మ్యాచ్ అనంతరం ధోనీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఎంఎస్ ధోనీ తన ఐపీఎల్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. ‘ఇప్పటికిప్పుడు ఐపీఎల్‌కు నేను రిటైర్మెంట్ ప్రకటించను. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఆడుతున్నా. ఐపీఎల్‌లో ఆడడంపై ప్రతి ఏడాది సమీక్షించుకుంటా. ప్రస్తుతం నాకు 43 ఏళ్లు. జులైలో 44 ఏళ్లు వస్తాయి. వచ్చే ఐపీఎల్‌లో ఆడాలా? వద్దా? అని నిర్ణయించుకోవడానికి నాకు ఇంకా 10 నెలల సమయం ఉంది. నా రిటైర్మెంట్ నిర్ణయించేది నేను కాదు. నా శరీరం నా రిటైర్మెంట్‌ను నిర్ణయిస్తుంది . ఐపీఎల్ ప్రారంభానికి ముందు శరీరం సహకరిస్తోందనిపిస్తే ఆడతా. ఇక చాలు అని నాకు అనిపించేంతవరకు ఇలానే కొనసాగుతా’ అని ధోనీ స్పష్టం చేశాడు.
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
Also Read: SRH vs GT: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర.. గుజరాత్ హ్యాట్రిక్ విజయం!
గత రెండు సీజన్లుగా ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ఎప్పటికపుడు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఎక్కువగా బ్యాటింగ్ చేయని ధోనీ.. ఈసారి రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఐపీఎల్ ఆరంభానికి రెండు నెలల ముందే చెన్నై వచ్చి ప్రాక్టీస్ మొదలెట్టి ఆ వార్తలకు చెక్ పెట్టాడు. ప్రతిసారి ధోనీ రిటైర్మెంట్ గురించి చెన్నై సీఈఓ, కోచ్ స్పందిస్తుంటారు. ఎలాంటి క్లారిటీ వారు అభిమానులను గందరగోళంలోకి నెట్టేస్తారు. మొదటిసారి మహీ స్వయంగా తన రిటైర్మెంట్‌పై స్పందించి ఓ క్లారిటీ ఇచ్చాడు.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!