KKR vs MI Toss: ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇప్పటికే మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండే. అయితే కోల్‌కతాలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో.. ఇంకా టాస్ కూడా పడలేదు. ప్రస్తుతం వరుణుడు శాంతించాడు. దాంతో మైదాన సిబ్బంది గ్రౌండ్‌ని సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారు. మైదానంలోని కవర్లపై ఉన్న నీటిని బయటికి పంపిస్తున్నారు. 8.45 గంటలకు అంపైర్లు గ్రౌండ్‌ని పరిశీలించి.. రాత్రి…
MS Dhoni entertained fans Says Virender Sehwag: ఎంఎస్ ధోనీని చూడటానికే క్రికెట్ అభిమానులు ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను చూసేందుకు వస్తున్నారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. మ్యాచ్‌ను చూడటానికి వచ్చే అభిమానులు టికెట్ కొనుగోలు చేసిన మొత్తానికి మహీ ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాడన్నాడు. చెన్నై విజయం సాధించినా, ఓడిపోయినా అభిమానులకు అవసరం లేదని.. ధోనీ బాగా ఆడితే చాలని సెహ్వాగ్ పేర్కొన్నాడు. గుజరాత్‌పై ఓడిన చెన్నై.. ప్లే ఆఫ్స్…
Gerald Coetzee on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ నుంచి ముందుగా వైదొలిగిన టీమ్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలని చూస్తోంది. అయితే ముంబై జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అసంతృప్తి అంటూ సోషల్ మీడియాలో చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో తమ కెప్టెన్‌ను పేసర్ గెరాల్డ్ కొయిట్జీ వెనకేసుకొచ్చాడు.…
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2024లో జట్టు విజయాలతో పాటు బ్యాట్స్‌మెన్‌గా పంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడిన 12 గేమ్ లలో 413 పరుగులను 156 స్ట్రైక్ రేటుతో సాధించాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ముగిసే వరకు ఉండి తన జట్టుకు భారీ పరుగులు అందించడానికి ప్రయత్నిస్తున్నాడు. గాయం నుంచి తిరిగి వచ్చిన డీసీ కెప్టెన్.. డిఫెన్స్ లోనే కాకుండా అటాక్ లోనూ అద్భుతంగా రాణించాడు. అతను వికెట్ వెనుకల కూడా…
Gautam Gambhir Heap Praise on Shah Rukh Khan: కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ మరోసారి తెలిపాడు. షారుఖ్ లాంటి ఓనర్ ఉండడం తన అదృష్టం అని పేర్కొన్నాడు. షారుఖ్‌తో తన బంధం ఎంతో అద్భుతమైనదని, తాను పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడే అని ప్రశంసించాడు. ఎస్‌ఆర్‌కే క్రికెట్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే…
ఐపీఎల్ ప్రస్తుత 17వ సీజన్ కొత్త హిస్టరీ క్రీస్తే చేసింది. ఈ సీజన్ లో మొత్తం 14 సెంచరీలు నమోదయ్యాయి. ఇంతవరకు ఏసీజన్ లో కూడా ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించారు. దాంతో ఈసారి సీజన్ లో సెంచరీల సంఖ్యను 14కి పెంచారు. కాగా, నిన్నటి మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ చేసిన సెంచరీ…
Rishabh Pant Suspension By BCCI: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఐపీఎల్ 2024లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం అతడిపై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాదు రూ.30 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం మధ్యాహ్నం ఓ ప్రకటన విడుదల చేసింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ స్లో ఓవర్…
KKR Fan Requests Gautam Gambhir: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో 2012, 2014లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌తోనూ గంభీర్‌కు మంచి స్నేహం ఉంది. ఈ కారణంగానే మళ్లీ గౌతీ కోల్‌కతాలో భాగం అయ్యాడు. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతేడాది లలక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిన గౌతీ.. తిరిగి కోల్‌కతాకు వచ్చేశాడు. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో…
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యా్చ్ లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎంఎస్ ధోనీ అభిమాని ఒకరు.. స్టేడియంలోకి దూసుకువచ్చిన అతనికి పాదాభివందనం చేశాడు. అయితే, సీఎస్కే ఛేజింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.