ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు డబల్ డెక్రర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. చెన్నైతో జరుగుతున్న మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది రాజస్థాన్. పరుగులు సాధించడంలో రాజస్థాన్ బ్యాటర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ.. చెన్నై బౌలర్లు రన్స్ చేయకుండా కట్టడి చేశారు. రాజస్థాన్ బ్యాటింగ్ లో రియాన్ పరాగ్ (47*) అత్యధికంగా పరుగులు చేసి జట్టుకు కీలక పరుగులు అందించాడు.
RCB Coach Mike Hesson on DC: ఈరోజు తమను ఓడించడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు కష్టమే అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ లేకపోవడంతో ఢిల్లీ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోందన్నాడు. సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుండటం తమకు కలిసొస్తుందని మైక్ హెస్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నేడు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్…
CSK vs RR Playing 11: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధృవ్ జురెల్ జట్టులోకి వచ్చాడు. మహీశ తీక్షణ చెన్నై తుది జట్టులోకి వచ్చాడు. రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తాడని, డారిల్ మిచెల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెన్నై సారథి గైక్వాడ్ చెప్పాడు.…
మే 12న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆడుతుంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్ లలో 5 గెలిచింది, ఇప్పుడు ప్లేఆఫ్ లకు అర్హత సాధించడానికి అవకాశం పొందడానికి తదుపరి 2 గేమ్ లను తప్పక గెలవాలి. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వారి చివరి 5 మ్యాచ్ లలో…
ఐపీఎల్ 2024 17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతుంది. రెండు జట్ల మధ్య ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. చెన్నైలోని ఎం చిదంబరం క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
కోల్కతా నైట్ రైడర్స్ 2024 ఐపిఎల్ సీజన్‌లో తమ అద్భుతమైన ఫామ్ ను కొనసాగించింది. తొమ్మిదో విజయంతో ప్లేఆఫ్స్ లోకి అధికారికంగా ప్రవేశం అయినట్లే. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిలిచింది. ముంబై ఇండియన్స్ కి మరో ఓటమి ఎదురైంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు కోల్‌కతా 18 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. వర్షం కారణంగా ఆలస్యమైన ప్రారంభం తర్వాత 16 ఓవర్లకు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. వర్షం కారణంగా.. 16 ఓవర్లకు కుదించడంతో.. 16 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ముంబై ముందు 158 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
Jio Cinema Prediction on IPL 2024 Playoffs: ఐపీఎల్ 2024 లీగ్ దశ తుది అంకానికి చేరుకుంది. మరో వారం రోజుల్లో లీగ్ దశ ముగియనుంది. దాదాపుగా అన్ని జట్లు 12 మ్యాచ్‌లు ఆడినా.. ఒక్క టీమ్ కూడా అధికారిక ప్లేఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకోలేదు. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. 8 జట్లు రేసులో ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్‌లను దాదాపు…
Delhi Capitals Captain is Axar Patel; ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నడిపించనున్నాడు. ఐపీఎల్ 2024 భాగంగా ఆదివారం (మే 12) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా అక్షర్ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను ఐపీఎల్ యాజమాన్యం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. దాంతో బెంగళూరుతో మ్యాచ్‌కు ఢిల్లీ కెప్టెన్‌గా…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంతో టాస్ ఆలస్యమైంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 9.15 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంతో ఇరు జట్లకు ఓవర్లు తగ్గించారు. రెండు టీమ్లు 16 ఓవర్లు ఆడనున్నాయి.