Gerald Coetzee on Hardik Pandya Captaincy: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ నుంచి ముందుగా వైదొలిగిన టీమ్ ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించిన ముంబై.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలవాలని చూస్తోంది. అయితే ముంబై జట్టులో ఆటగాళ్ల మధ్య విభేదాలు, కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అసంతృప్తి అంటూ సోషల్ మీడియాలో చాలానే కథనాలు వస్తున్నాయి. ఇలాంటి వివాదాల నేపథ్యంలో తమ కెప్టెన్‌ను పేసర్ గెరాల్డ్ కొయిట్జీ వెనకేసుకొచ్చాడు. తమ కెప్టెన్ చాలా మంచోడని, హార్దిక్ సారథ్యం ఎవరికీ తీసిపోదని పేర్కొన్నాడు.
Also Read: Rishabh Pant: ఏంటి పంత్.. నీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే..
ప్రీ మ్యాచ్ ప్రెసెంటేషన్ సమావేశంలో గెరాల్డ్ కొయిట్జీ మాట్లాడుతూ… ‘హార్దిక్ పాండ్యా మంచి కెప్టెన్ అని నేను అనుకుంటున్నాను. అతడి కెప్టెన్సీ చాలా బాగుంది. ఇప్పటివరకు మనం విభిన్నమైన సారథ్య శైలిని చూసి ఉంటాం. హార్దిక్ మాత్రం కొత్త స్టైల్‌తో తనకంటూ గుర్తింపు పొందాడు. ఎవరి సారథ్యమూ ఒకేలా ఉండదు. వ్యక్తిని బట్టి కెప్టెన్సీ మారుతూ ఉంటుంది. హార్దిక్ చాలా మంచివాడు. జట్టులోని ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపడంలో ముందుంటాడు. మ్యాచ్ ప్రణాళిక విషయంలో ఓ స్పష్టతతో ఉంటాడు. హార్దిక్ సారథ్యం ఎవరికీ తీసిపోదు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగతంగానూ అద్భుతమైన వ్యక్తి. ఈ ఐపీఎల్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికంటే మరెవరూ అద్భుతంగా బౌలింగ్ చేయలేదు’ అని అన్నాడు.