Gautam Gambhir: అలాంటి ఓనర్ ఉండటం నా అదృష్టం: గంభీర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir Heap Praise on Shah Rukh Khan: కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ మరోసారి తెలిపాడు. షారుఖ్ లాంటి ఓనర్ ఉండడం తన అదృష్టం అని పేర్కొన్నాడు. షారుఖ్‌తో తన బంధం ఎంతో అద్భుతమైనదని, తాను పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడే అని ప్రశంసించాడు. ఎస్‌ఆర్‌కే క్రికెట్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పిస్తాడని గంభీర్ చెప్పాడు. కోల్‌కతాకు గంభీర్ రెండుసార్లు (2012, 2014) ఐపీఎల్ ట్రోఫీ అందించిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఢీకొట్టనుంది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ కీడాతో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘షారుఖ్ ఖాన్‌తో నాకు అద్భుతమైన అనుబంధం ఉంది. నేను పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అతడు వ్యక్తి. అతను వినయంగా ఉంటాడని ఈ మాట చెప్పడం లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అతడిది. అతను క్రికెట్ విషయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోడు. నాలాంటి వ్యక్తికి ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే సొంతంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కల్పిస్తాడు. అలాంటి ఓనర్ ఉండటం నా అదృష్టం’ అని అన్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Babar Azam: టీ20లలో బాబర్ ఆజమ్ సరికొత్త చరిత్ర.. ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాలేదు!
‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా షారుఖ్ ఖాన్ మద్దతుగా ఉంటాడు. నాపై నమ్మకం ఉంచుతాడు. అందుకే మేము అద్భుత ఫలితాలను సాదిస్తున్నాం. షారుఖ్‌తో నా సంబంధం అద్భుతమైనది. ఈ బంధం ఇప్పటిది కాదు.. 2011లో కోల్‌కతాలో చేరినప్పటి నుండి ఉంది. షారుఖ్ ఓ ఎమోషన్ అని అందరూ చెప్తారు. షారుఖ్‌తో పాటు నాకు కేకేఆర్ కూడా ఓ ఎమోషనే’ అని గౌతమ్ గంభీర్ చెప్పాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను కెమెరాల ముందే తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గౌతీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఐపీఎల్ 2023లో లక్నోకు గంభీర్ మెంటార్‌గా ఉన్న విషయం తెగెలిసిందే.
తాజావార్తలు
-
INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
-
Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Jr NTR Fan: ఎన్టీఆర్ ను కలిసి ముద్దాడిన ఫ్యాన్
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!