Gautam Gambhir: గంభీర్ భయ్యా.. మీరు వెళ్లినప్పుడు మా హృదయం ముక్కలైంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KKR Fan Requests Gautam Gambhir: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది. గౌతమ్ గంభీర్ నాయకత్వంలో 2012, 2014లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్‌తోనూ గంభీర్‌కు మంచి స్నేహం ఉంది. ఈ కారణంగానే మళ్లీ గౌతీ కోల్‌కతాలో భాగం అయ్యాడు. గంభీర్ ప్రస్తుతం కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతేడాది లలక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిన గౌతీ.. తిరిగి కోల్‌కతాకు వచ్చేశాడు. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో కొనసాగడానికి ప్రధాన కారణం గంభీర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ క్రమంలో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్‌కు ఓ అభిమాని నుంచి విజ్ఞప్తి వచ్చింది. ‘గంభీర్ భయ్యా.. మేం మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే. మీరు ఎప్పటికీ కోల్‌కతాను వదిలిపెట్టొద్దు. గతంలో మీరు కోల్‌కతా ను వదిలి వెళ్లినప్పుడు మా హృదయం ముక్కలైంది. ఆ బాధను మాటల్లో వర్ణించలేం. మీ కోసం ఓ బెంగాలీ పాటను అంకితం చేద్దామనుకుంటున్నా. మీరు ఎప్పటికీ మమ్మల్ని వదిలిపెట్టొద్దు. మీరు మా హృదయం. ప్లీజ్ సర్ ఎక్కడికీ వెళ్లొద్దు’ అంటూ అభిమాని కోరుకున్నాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Chennai Super Kings: గుజరాత్ మ్యాచ్‌లో ఓటమి.. చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం!
అభిమాని మాటలకు గౌతమ్ గంభీర్ ముసిముసిగా నవ్వుకున్నాడు. ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీనికి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 17వ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. 8 విజయాలను ఖాతాలో వేసుకుంది. కేకేఆర్ ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నేడు ముంబైతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?