IPL 2024 Chennai Super Kings Playoff Chances: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 232 పరుగుల భారీ ఛేదనలో చెన్నై పోరాడినా.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులే చేయగలిగింది. డారిల్ మిచెల్ (63; 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), మోయిన్ అలీ (56; 36 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా ఓటమి తప్పలేదు. గుజరాత్ చేతిలో చెన్నై ఓడడంతో నాకౌట్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది.
పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ (16), రాజస్థాన్ రాయల్స్ (16) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో 11 మ్యాచ్‌లు ఆడాయి. నేడు యంబై ఇండియన్స్‌తో కోల్‌కతా తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా కోల్‌కతా నిలుస్తుంది. మరోవైపుకు రాజస్థాన్ ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. ప్లేఆఫ్స్ వెళుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచుల్లో 7 విజయాలు సాధించి.. 14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ మిగిలిన రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు అవుతుంది.
Also Read: Kajal Aggarwal : ఆ సమయంలో కాజల్ అన్న మాటకు షాక్ అయిన దర్శకుడు తేజ..?
ఇక శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌లలో ఆరు విజయాలు, ఆరు ఓటములను నమోదు చేసింది. పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ (12), లక్నో సూపర్ జెయింట్స్ (12)తో చెన్నై సమంగా ఉన్నప్పటికీ.. నెట్‌రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో టాప్ 4లో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌లలో (రాజస్థాన్, బెంగళూరు) గెలిస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ఒక్కటి ఓడినా.. హైదరాబాద్, ఢిల్లీ, లక్నో ఫలితాలపై చెన్నై ఆధారపడాల్సి ఉంది. ఢిల్లీ, లక్నో తమ తర్వాతి మ్యాచులో నెగ్గి 14న ముఖాముఖి పోటీపడతాయి. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్ రేసులో ఉంటారు. ఓడితే ఆశలు గల్లంతు.