Sunil Gavaskar: అతడు ఫామ్‌లో ఉన్నాడు.. టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ ఎలా చెలరేగిపోతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా.. ఎన్నో మెరుపులు మెరిపించాడు. చాలాసార్లు జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. మునుపెన్నడూ లేని రౌద్ర రూపం దాల్చి, మైదానంలో తాండవం చేస్తున్నాడు. ఆర్సీబీ జట్టుకి బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే.. కార్తీక్‌ను తిరిగి టీమిండియాలో తీసుకోవాల్సిందిగా మద్దతులు లభిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి.. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలని క్రికెట్ ప్రియులతో పాటు మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఈ జాబితాలో తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరిపోయాడు. టీమిండియాలోకి కంబ్యాక్ ఇచ్చేందుకు దినేశ్ కార్తీక్ చాలా కష్టపడుతున్నాడని అన్నాడు. తాను గతేడాది కార్తీక్‌తో చాలా సమయం గడిపానని, సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో 10-12 రోజులు పాటు తామిద్దరం క్వారంటైన్‌లో గడిపామని, అప్పుడతడు తిరిగి మళ్లీ భారత జట్టులోకి రావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడని ఆయనన్నాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టుకు ఆడాలాని కార్తీక్ భావించాడు కానీ, అతని కోరిక అప్పుడు నెరవేరలేదన్నాడు. బహుశా ఈ ఏడాది అది నేరవేరవచ్చని, ఎందుకంటే కార్తీక్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడని వెల్లడించాడు.
Also Read
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
‘‘దినేశ్ కార్తీక్ ఆటతీరుని చూస్తుంటే, అతడు తిరిగి ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడని అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ జట్టుకి బెస్ట్ ఫినిషర్‌గానూ నిలిచాడు. కాబట్టి అతడు కచ్చితంగా భారత టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని నేను నమ్ముతున్నాను” అని ఓ ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. మరి, ఆయన చెప్పినట్టు దినేశ్‌కి టీమిండియాలో చోటు దక్కుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ! కాగా.. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 274 పరుగులు సాధించాడు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?