CSK: చెన్నైకి పెద్ద షాక్.. జడేజా ఔట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అంతంత మాత్రమే ఉంది. ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు నీరుగారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జట్టుకి మరో పెద్ద షాక్ తగిలింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. పక్కటెముక గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఈ విషయాన్ని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జడేజా ఛాతిపై గాయాలయ్యాయి. అందుకే, అతడు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. తదుపరి మ్యాచ్‌లో ఆ గాయం తీవ్రత తగ్గుతుందని భావిస్తే, అందుకు భిన్నంగా అది రెట్టింపు అయ్యింది. దీంతో.. లీగ్ దశలో చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండటం లేదు. వైద్యుల సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెన్నై జట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
- WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
ఇదిలావుండగా.. చెన్నై జట్టులోని కీలకమైన ఆటగాళ్ళలో ఒకడైన జడేజా, ఈ సీజన్‌లో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. మొత్తం పది మ్యాచుల్లో కేవలం 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ ఐదు వికెట్లే తీశాడు. సీజన్ ప్రారంభంలో కెప్టెన్ పగ్గాలు ఇవ్వడంతో.. ఆ బాధ్యత మోయలేకపోవడం వల్లే సమర్థంగా జట్టుని నడిపించలేకపోయాడు, తానూ రాణించలేకపోయాడు. దీంతో, కెప్టెన్ బాధ్యతల్ని తిరిగి ధోనీ అందుకున్నాడు.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!