Tragedy : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!
- నాగర్ కర్నూలుకు చెందిన జగదీశ్, జెనీమాకు పరిచయం
- కొద్ది రోజులుగా ప్రేమించమంటూ వెంటపడుతున్నాడు
- జగదీశ్.. జెనీమాను వేధిస్తున్నాడు
- ఎందుకు ప్రేమించడం లేదంటూ బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రేమించమంటూ ఓ యువతి వెంటపడ్డాడు.. వినకపోవడంతో కుటుంబసభ్యులను బెదిరించాడు. ఐనా యువతి దారిలోకి రాకపోవడంతో, చివరకు ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడో ప్రేమోన్మాది. కొద్ది సేపటికే ఆ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీంతో తన కూతురును ప్రేమించమంటూ వెంటపడ్డ యువకుడే హత్య చేశాడని యువతి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ చిలకలగూడలో ఈ ఘటన కలకలం సృష్టించింది. చిలకలగూడలోని శ్రీనివాస్‌నగర్‌లో కోటేశ్వర్‌రావు, రమాదేవి కుటుంబం నివాసం ఉంటోంది. కూరగాయల వ్యాపారం చేసే ఈ దంపతుల కూతురు జెనీమా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఐదు నెలల క్రితం నాగర్ కర్నూలుకు చెందిన జగదీశ్, జెనీమాకు పరిచయమయ్యాడు. జగదీశ్‌ను ఫ్రెండ్‌గా భావించిన జెనీమా వెంట గత కొద్ది రోజులుగా ప్రేమించమంటూ వెంటపడుతూ వచ్చాడు. జెనీమా మాత్రం జగదీశ్ ప్రేమ ప్రపోజల్‌ను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో గత కొద్ది రోజుల నుంచి జగదీశ్, జెనీమాను వేధిస్తున్నాడు. చివరకు జెనీమా ఇంట్లో ఎవరూ లేరని.. ఇంట్లో ఒక్కతే ఉందన్న విషయం పసిగట్టిన జగదీశ్.. ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. తనను ఎందుకు ప్రేమించడం లేదంటూ బెదిరింపులకు దిగాడు. ఎంతకీ జెనీమా ఒప్పుకోకపోవడంతో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. జెనీమా కాలి వేళ్లను తొక్కుతూ బెదిరింపుకు పాల్పడ్డాడు. ఐనా. జెనీమా మాత్రం ఒప్పుకోలేదు. దీంతో అంతు చూస్తానని బెదిరించాడు జగదీశ్..
US: అమెరికాలో షాకింగ్ ఘటన.. ట్రంప్ ఉన్నతాధికారి రాజీనామా.. యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
జెనీమా, తల్లిదండ్రులు… కూరగాయల వ్యాపారం చేసేవారు.. రోజూ మాదిరిగానే ఉదయమే ఇంట్లోంచి ఇద్దరు బయటికి వెళ్లారు. కొద్ది సేపటికే జెనీమా, తల్లికి ఫోన్ చేసి జగదీశ్ వచ్చి తనను కొట్టాడని చెప్పడంతో హుటాహుటిన ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లిన జెనీమా తల్లి రమాదేవికి.. కూతురు ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే తల్లి కేకలు విన్న స్థానికులు హుటాహుటిన ఆమె ఇంటి దగ్గరికి వచ్చారు. ఫ్యాన్‌కు వెలాడుతున్న జెనీమాను కిందకి దింపి చూడగా.. కొన ఊపిరితో ఉన్నట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు అప్పటికే జెనీమా చనిపోయిందని ధృవీకరించారు..
తాను ఇంటి నుంచి బయల్దేరినప్పుడు తన కూతురు రోజు మాదిరిగానే ఇంట్లో పని చేసుకుంటుందని ఆమె తండ్రి కోటేశ్వర్‌రావు అంటున్నాడు. తన కూతురును జగదీశ్ అనే వాడు వేధిస్తున్నాడన్న విషయం తనకు తెలియదని.. ఒకవేళ ఆ విషయం తెలిసి ఉంటే మాట్లాడి పరిష్కరించుకునే వాళ్లమని, తన కూతురు తనకు దక్కేదని జెనీమా తండ్రి కన్నీటి పర్యాంతమవుతున్నాడు.. జెనీమాను జగదీశే చంపాడని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. చిలకలగూడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ జగదీశ్ చంపాడంటూ పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు జగదీశ్ కోసం గాలిస్తుండగా.. పోస్టుమార్టం పూర్తయిన తరువాత జెనీమా డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు…
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!