ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్ మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టైటాన్స్ జట్టు.. బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగింది. ప్రతి మ్యాచ్‌లోనూ పటిష్టంగా రాణించిన ఈ జట్టు.. ఈసారి మాత్రం తడబడింది. ఓపెనర్ సాహా 5 (11) పరుగులకే వెను దిరగగా.. శుభ్మన్ గిల్ ఒక్కడే 49 బంతుల్లో 7 ఫోర్లతో 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మిగిలిన వాళ్ళందరూ అంతగా సత్తా చాటలేకపోయారు. చివర్లో రాహుల్ తెవాతియా ఒక్కడే 16 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. దీంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి గుజరాత్ టైటాన్స్ కేవలం 144 పరుగులు చేసింది.
బౌలింగ్ విషయానికొస్తే.. చమీరా, జేసన్ హోల్డర్ మినహాయించి మిగిలిన బౌలర్స్ అందరూ గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మన్లను కట్టుదిట్టం చేయడంలో సఫలమయ్యారు. అన్వేశ్ ఖాన్ 4 ఓవర్లో 26 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మోహసిన్ ఖాన్, జేసన్ హోల్డర్ చెరో వికెట్ తీశారు. అయితే.. జేసన్ ఏకంగా 41 పరుగులు సమర్పించుకున్నాడు. లోక్నో ముందున్న లక్ష్యం పెద్దది కాదు కాబట్టి, బహుశా ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, ఐపీఎల్‌లో ఎప్పుడు, ఏం జరుగుతుందో ఊహించడం కష్టం కాబట్టి.. ఏమైనా జరగొచ్చు.