Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన స్వదేశానికి తిరిగి రాబోతున్నారని సమాచారం. జూన్ 5న జరిగే విచారణకు హాజరవుతానని ఆయన ఇప్పటికే దర్యాప్తు బృందానికి తెలిపినట్లు తెలిసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ, ప్రభాకర్ రావు ఓ అండర్‌టేకింగ్ లెటర్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవ్వడం…
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి ఆయన హాజరయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణ ముగిసింది.. రెండు గంటలపాటు సీఐడీ అధికారులు ఆర్కేను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. నోటీసు ఇవ్వడంతో తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. తాను ఆ రోజు…
Gulzar House : హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం నగరాన్ని షేక్ చేసింది. శ్రీకృష్ణ పెరల్స్ పేరిట పలు సంవత్సరాలుగా ఆభరణాల వ్యాపారం చేస్తున్న గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీలకు చెందిన ఈ షాపులో మే 18 వ తేదీన అర్థరాత్రి తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది అమూల్యమైన ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం ఘటనపై వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.…
ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్స్ తో ఆర్మీ ఉద్యోగాలు పొందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ ఉద్యోగాలు సాధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. నివాస దృవీకరణ పత్రాల కోసం యూపి, రాజస్థాన్ కు చెందిన వారు గ్రామాల్లో ఎవ్వరిని ఆశ్రయించారనే దాని పై పోలీసులు దృష్టిసారించారు. అప్పుడు పనిచేసిన సర్పంచ్ లు,ఇతర ప్రజాప్రతినిధుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.…
అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.. పీసీసీఎఫ్ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్..
ఏపీ సచివాలయం రెండవ బ్లాక్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బందికి ఎస్పీఎఫ్ సిబ్బంది సమాచారం ఇచ్చింది. ఫైర్ సేఫ్టీ సిబ్బంది వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా? కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుగుతోంది.
Pastor Praveen: హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. వివిధ కోణాల్లో పూర్తిస్థాయి నివేదికలతో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు రేపు మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పెద్ద చెరువులో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులు ప్రకటించినప్పటికీ, మృతుల కుటుంబ సభ్యులు మాత్రం హత్యగా ఆరోపిస్తున్నారు. భర్త యేసు తన ముగ్గురు పిల్లలతో పాటు రెండో భార్యను చెరువులో తోసి హత్య చేశాడని చిన్నారుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు తక్షణమే…
గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు మరోసారి దారుణానికి తెగబడ్డారు. బాంరగడ్ తాలుక జూవి గ్రామానికి చెందిన పూసు పుంగంటి (52) అనే వ్యక్తిని మావోలు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం మేరకు, ఓ వివాహ వేడుకకు వెళ్లిన పూసు పుంగంటిని మావోయిస్టులు కిడ్నాప్ చేసి, అనంతరం హత్య చేశారు. అతను పోలీసులకు సహకరిస్తున్నాడనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ…
Betting Apps :బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాచారం అందిస్తూ, ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై ఉన్నాయని స్పష్టం చేశారు. నెలలుగా పెద్ద దందాగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో…