Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతిచెందింది.. ఆ చిరుత కడుపులో రెండు పిల్లలు కూడా చనిపోవడంపై విమర్శలు వచ్చాయి.. మదనపల్లె మండలం పొన్నూటిపాళెం సమీపంలోని అటవీ ప్రాంతం సమీపంలో పొలం గట్టుపై వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో పడిన ఆడ చిరుత.. దాదాపు 8 గంటల పాటు నరకయాతన అనుభవించి ప్రాణాలు విడిచింది.. వేటగాళ్ల ఉచ్చునుంచి బయటపడడానికి చిరుత చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మృత్యుఒడికి చేరింది.. అయితే, అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో చిరుత మృతి ఘటనపై సమగ్ర విచారణ చేయాలని డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.. పీసీసీఎఫ్ చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: JEE Main: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫైనల్ ‘కీ’ వచ్చేసింది..
పొన్నూటిపాళెం వద్ద ఆడ చిరుత వేటగాళ్ల ఉచ్చులోపడిపోయి కొన్ని గంటలపాటు పెనుగులాడి చనిపోయింది.. ఆ చిరుత కడుపులో రెండు కూనలు ఉండటం, ఆ కూనలు కూడా గర్భంలో చనిపోయాయి.. అయితే, ఈ ఘటనపై క్షేత్రస్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని, శాఖాపరంగా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఘటన చోటు చేసుకున్న అనంతరం సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందించారనే విషయాన్ని తెలియచేయాలని ఆదేశించారు.. ఉచ్చులు వేసే వేటగాళ్లు, ఆ తరహా నేరాలు చేస్తున్నవారిపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు.. పొన్నూటిపాళెం ఘటనపై విచారణను పర్యవేక్షించాలని అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావుకి దిశానిర్దేశం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..