ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేటి విచారణపై సందిగ్ధం నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇండియాకు ఇంకా ప్రభాకర్ రావు చేరుకోలేదు. ప్రభాకర్ రావు ఇండియాకు రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా ప్రభాకర్ రావు తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. ట్రావెలింగ్ వీసా తీసుకున్న మూడు రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read:Virat Kohli: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన కోహ్లీ!
ప్రభాకర్ రావుకి వన్ టైం ఎంట్రీ ట్రావెలింగ్ వీసా ఇవ్వాలని సంబంధించిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇతర దేశాలకు వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావును విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం. ఇప్పటికే నిందితుల స్టేట్మెంట్స్, కీలకమైన అంశాలను, డేటాను సిట్ సేకరించింది. ప్రభాకర్ రావుకి వన్ టైం ఎంట్రీ పాస్ పోర్టు ఇంకా అందలేదని సమాచారం. కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉండడంతో.. ప్రభాకర్ రావు ఇండియాకు తిరిగి రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.