Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆయన స్వదేశానికి తిరిగి రాబోతున్నారని సమాచారం. జూన్ 5న జరిగే విచారణకు హాజరవుతానని ఆయన ఇప్పటికే దర్యాప్తు బృందానికి తెలిపినట్లు తెలిసింది. ఈ కేసులో సుప్రీం కోర్టుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ, ప్రభాకర్ రావు ఓ అండర్‌టేకింగ్ లెటర్‌ను కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవ్వడం ద్వారా కేసులో కీలకమైన విషయాలు వెలుగు చూడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Corona: దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి
దర్యాప్తు బృందం కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉంది. ఆయన నుంచి సమగ్ర సమాచారం లభిస్తే, ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత క్లారిటీకి రావచ్చని భావిస్తున్నారు. ఈ కేసు తాజాగా మళ్లీ వేగం పుంజుకుంటుండటం, ప్రభాకర్ రావు విచారణకు హాజరుకావడం వల్ల, రాజకీయంగా కూడా పరిణామాలు ఉండే అవకాశముంది.