Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీకార్యాలయం మళ్లీ మారింది. గత రెండు నెలలుగా వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం నుంచి పని చేస్తున్న సిట్‌ను మాసబ్ ట్యాంక్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోకి బదిలీ చేశారు. ఈ కార్యాలయ మార్పుతో కేసు విచారణపై ఉత్కంఠ తీవ్రంగా పెరిగింది. రేపు కీలక సూత్రధారి, మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు సిట్ కార్యాలయం వద్ద విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ రాత్రికి ప్రభాకర్ రావు హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారి అయిన ఆయన విచారణ మరింత కఠినంగా, విస్తృతంగా సాగనుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి కొత్త వివరాలు వెలుగులోకి వస్తాయో ఈ విచారణపై అందరి ఆసక్తి పెరిగింది.
Breaking : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం హ్యుమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు