ఆదిలాబాద్ జిల్లాలో ఫేక్ సర్టిఫికెట్స్ తో ఆర్మీ ఉద్యోగాలు పొందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ ఉద్యోగాలు సాధించిన కేసులో విచారణ కొనసాగుతోంది. నివాస దృవీకరణ పత్రాల కోసం యూపి, రాజస్థాన్ కు చెందిన వారు గ్రామాల్లో ఎవ్వరిని ఆశ్రయించారనే దాని పై పోలీసులు దృష్టిసారించారు. అప్పుడు పనిచేసిన సర్పంచ్ లు,ఇతర ప్రజాప్రతినిధుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు.
Also Read:Vijay : విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ లో రష్మిక కన్ఫర్మ్..
ఇస్లాంనగర్, కోకస్ మన్నూర్ తోపాటు ఇచ్చోడ మండలంలోని పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. గత 27 తేదిన ఫేక్ సర్టిఫికెట్లతో సైన్యంలో ఉద్యోగాలు పొందిన విషయాన్ని ఎన్టీవీ వెలుగులోకి తెచ్చింది. ఎన్టీవీ కథనాలతో ఇచ్చోడలో ఒక్క కేసు, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. మొన్నటి వరకు ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి వద్ద నుంచి తమ దైన స్టైల్లో వివరాలు రాబట్టుతున్నారు.
Also Read:Goa Stampede: గోవాలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. 50 మందికి గాయాలు
మీ సేవల్లోని సర్టిఫికెట్లు, రెవెన్యూ కార్యాలయంలోకి వచ్చిన దరఖాస్తులు, ఇచ్చిన సర్టిఫికెట్ల ప్రింట్ పేపర్ల లెక్కలను పోలీసులు తీసుకున్నారు. మరో వైపు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు మీ సేవల్లో సైతం తనిఖీ చేశారు. ఏం జరిగిందనే దానిపై మండల రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ నివేదిక కోరారు. ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారి పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ స్థాయిలో ఆధార్ కార్డులో అడ్రస్ మార్పు కోసం సంతకాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం మరో రెండు రోజుల్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.