మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ భార్య చేసిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు లండన్ నుంచి తిరిగి వచ్చిన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. హత్య తర్వాత.. ఆ భార్య ప్రియుడితో కలిసి తన భర్త మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికింది. ఇద్దరూ కలిసి ఆ ముక్కలను డ్రమ్ములో వేసి సిమెంట్‌లో ప్యాక్ చేశారు. ఆ డ్రమ్మును ఇంట్లోనే ఉంచారు. ఈ…
బంగారం స్మగ్లింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి రన్యారావు కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పలుమార్లు ఆమె దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.
అతి వేగం ప్రమాదకరం… అనే మాటలు దాదాపు ప్రతి హైవే మీద చదువుతాం. ఎందుకంటే వేగంగా డ్రైవ్ చేసి ప్రమాదానికి గురికావడం కంటే తక్కువ వేగంతో సురక్షితంగా ఇంటికి చేరుకోవడం ఉత్తమం. ఇది ఆ పదబంధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. కానీ, కొందరు వాహనదారులు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. దాంతో భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఇందుకు నిదర్శనంగా జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…
AP Govt: అన్నమయ్య జిల్లాలోని పీలేరు చుట్టు పక్కల ఉన్న ఆరు గ్రామాల పరిధిలో అన్యాక్రాంతమైన నాలుగు వందల కోట్ల ప్రభుత్వ భూములపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. అనంతరం.. వైద్య పరీక్షలు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు పోలీసులు. వంశీని మూడు గంటలకు పైగా విచారించారు.
Sambhal Violence : సంభాల్ హింసపై సిట్ దర్యాప్తు పూర్తి చేసింది. ఆ బృందం వెయ్యి పేజీలకు పైగా చార్జిషీట్ దాఖలు చేసింది. ఎంపీ జియా ఉర్ రెహమాన్ బార్క్, సదర్ ఎమ్మెల్యే కుమారుడు సుహైల్ ఇక్బాల్ సహా 37 మంది నిందితులు నిందితుల్లో ఉన్నారు
ఎల్ఐసీ డబ్బుల కోసమని ఆశపడి బావనే బామ్మర్ది మర్డర్ చేశాడు. కాగా.. ఈ మర్డర్ కేసును అమీన్‌పూర్ పోలీసులు 24 గంటల్లో చేధించారు. బీమా డబ్బులు కోసమే సొంత బావను బావమరిది హత్య చేసినట్లుగా గుర్తించారు. గోపాల్ నాయక్‌ను అతని బామ్మర్ది నరేష్, మేనమామ దేవి సింగ్‌లు హత్య చేసినట్లుగా పోలీసులు కనుగొన్నారు.
Ameenpur: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబికుల మధ్య ఆర్థిక వివాదం ప్రాణహానికి దారితీసింది. ఇటీవలే జేసీబీ కొనుగోలు చేసారు గోపాల్, అతని బామ్మర్ది సురేష్. అయితే గోపాల్ తన స్వార్థ ప్రయోజనాల కోసం బామ్మర్ది సురేష్ ను హత్య చేశాడు. జేసీబీ పూర్తిగా తన సొంతమవుతుందని భావించిన సురేష్, కిరాతకంగా ఈ హత్యకు పాల్పడ్డాడు. సురేష్ తన బావ గోపాల్‌ను నమ్మించి, మద్యం తాగుదామని పిలిచాడు. ఈ క్రమంలో తన స్నేహితుడిని కూడా…
Principal Slaps Teacher: గుజరాత్‌లోని భరూచ్ జిల్లా నవయుగ్ పాఠశాలలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పాఠశాల ప్రిన్సిపాల్ హితేంద్ర సింగ్ ఠాకూర్ తన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రాజేంద్ర పర్మార్‌ను 18 సార్లు చెంపదెబ్బ కొట్టిన వీడియో సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ వివాదం పాఠశాలలో గణితం, సైన్స్ పాఠాలు బోధిస్తున్న రాజేంద్ర…