ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్తాన్‌లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ సోషల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మహిళలు, పిల్లలపై హింసకు సంబంధించి 900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
Honduran: సెంట్రల్ అమెరికా దేశం హోండూరస్ లో దారుణం చోటు చేసుకుంది. మహిళా ఖైదీలు ఉండే ఓ జైలులో ముఠా ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాలు దాడులకు తెగబడ్డాయి. తుపాకీ, కొడవళ్లు, మండే కెమికల్స్ ఉపయోగించి దాడికి తెగబడ్డారు. దీంతో 46 మంది ఖైదీలను ముఠా సభ్యులు హతమర్చారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు. పర్యటన సందర్భంగా బ్లింకెన్ ఈ రోజు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా సమావేశమయ్యారు.
బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సాత్విక్-చిరాగ్ జోడి కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ విజృంభణతో వరుస గేమ్‌లలో మలేషియా జోడీని ఓడించారు.
అందరికీ ఆహారం ఉచితం అంటూ డొనాల్డ్ ట్రంప్ పెద్దగా సౌండ్ చేస్తూ ప్రకటించారు. దాంతో తాము తిన్నదానికి ట్రంపే బిల్లు చెల్లిస్తారని అక్కడివారంతా అనుకున్నారు. అయితే అక్కడ జరిగిన ఓ పరిణామం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తుంది.
Japan: గత శతాబ్ధకాలంలో మారని చట్టాలను జపాన్ తాజాగా మార్చింది. ప్రపంచంలో అతితక్కువ సెక్స్ సమ్మతి వయసు ఉన్న జపాన్ ఇప్పుడు దాన్ని పెంచింది. సెక్స్ వయోపరిమితిని 13 ఏళ్ల నుంచి 16కి పెంచింది. దీంతో పాటు అత్యాచారాన్ని పునర్నిర్వచించింది. శుక్రవారం జపాన్ పార్లమెంట్ సెక్స్ క్రైమ్ చట్టాలను సవరించింది. మానవహక్కుల సంఘాలు ప్రభుత్వం చర్యలను స్వాగతించాయి. ప్రస్తుతం 16 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఏదైనా లైంగిక చర్యలకు పాల్పడితే దాన్ని అత్యాచారంగా పరిగణిస్తామని నిబంధనలు…
న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనమైంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోవడంతో న్యూజిలాండ్ మాంద్యంలోకి జారిపోయింది. గురువారం విడుదల చేసిన డేటా ప్రకారం.. న్యూజిలాండ్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయింది.