Titanic submersible search yields debris field Coast Guard says: అట్లాంటిక్ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు.. ఆదివారం ఐదుగురు పర్యాటకులు టైటాన్ మినీ సబ్‌మెరైన్‌లో బయలుదేరిన విషయం తెలిసిందే. అయితే.. అది సముద్రగర్భంలో వెళ్లిన తర్వాత, ఒక్కసారిగా గల్లంతయ్యింది. అప్పటి నుంచి దాని ఆచూకీ కనుగొనడం కోసం రిమోట్ ఆపరేటెడ్ వెహికల్‌ని పంపించారు. ఈ అన్వేషణలో ఇప్పుడు ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. టైటానిక్ ఓడ సమీపంలో.. కొన్ని శకలాలను కనుగొన్నట్టు అమెరికన్ కోస్ట్ గార్డ్ ట్విటర్ మాధ్యమంగా వెల్లడించింది. ‘‘టైటానిక్ దగ్గరలో టైటాన్ సబ్‌మెరైన్‌ని వెతికేందుకు వెళ్లిన రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ కొన్ని శకలాలను గుర్తించింది. నిపుణులు ఈ సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు’’ అంటూ ట్వీట్ చేసింది. అయితే.. ఆ శకలాలు టైటాన్ జలాంతర్గామివా? కాదా? అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాగా.. అమెరికన్ కోస్ట్ గార్డ్‌తో పాటు కెనడా సైనిక విమానాలు, ఫ్రెంచ్ నౌకలు, టెలీగైడెడ్ రోబోలతో భారీ సెర్చ్ ఆపరేషన్ కూడా చేపట్టారు.
Errabelli Dayakar Rao: దేశానికి గాంధీ స్వతంత్రం తెస్తే.. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కేసీఆర్
మరోవైపు.. రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ కనుగొన్న శకలాలపై హవాయి విశ్వవిద్యాలయంలోని ఓషన్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ మాక్సిమిలియన్ క్రీమర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూఎస్ కోస్ట్ గార్డ్.. ఈ శిథిలాల క్షేత్రాన్ని పూర్తిగా వెరిఫై చేయాల్సి ఉందన్నారు. టైటానిక్ శకలాల సమీపంలో శకలాల క్షేత్రాన్ని కనుగొనడంలో ఆశ్చర్యం లేదని అన్నాడు. అయితే.. ఆ శకలాల్ని పరిశీలించాల్సి ఉంటుందని చెప్తున్నారు. బహుశా అది టైటానిక్ నుండి కాకపోవచ్చు, అది ప్రమాదానికి గురైన టైటాన్ జలాంతర్గామికి చెందినది అయ్యుండొచ్చని పేర్కొన్నాడు. గల్లంతైన టైటాన్‌లో 96 గంటల వరకు లైఫ్ సపోర్ట్ ఉందని, ఇప్పుడది తప్పిపోయి నాలుగు రోజులు అవుతుంది కాబట్టి పరిస్థితులు క్లిష్టంగానే ఉంటాయని భావిస్తున్నానన్నాడు. ఇలాంటి సమయంలో.. లీడర్లు అందరినీ ఒకే విధమైన నిద్రాణస్థితికి వెళ్లాలని సూచిస్తాడని, వీలైనంత తక్కువ ఆక్సిజన్ ఉపయోగించాలని సలహా ఇస్తాడని తెలిపాడు.