ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ (86) మరణించారని ఇటాలియన్ మీడియా సోమవారం తెలిపింది. దేశ రాజకీయ దృశ్యాన్ని మార్చడానికి ముందు ఇటలీలో అతిపెద్ద మీడియా కంపెనీని సృష్టించిన బిలియనీర్, వ్యాపారవేత్త అయిన సిల్వియో కొంతకాలంగా లుకేమియాతో బాధపడుతున్నారు.
Netherlands: యూరోపియన్ దేశం నెదర్లాండ్స్ లోని ఓ పట్టణంలో ప్రజల డిమాండ్ కు అక్కడి ప్రభుత్వం తలొగ్గింది. దేశంలోని వీరే పట్టణంలోని సముద్రం బీచ్ లో సెక్స్ కు వ్యతిరేకంగా అక్కడి స్థానికులు గళమెత్తారు. బీచుల్లో పబ్లిక్ గా సెక్స్ చేయడంపై అక్కడి స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికి వ్యతిరేకంగా బీచుల్లోని ఇసుకదిబ్బలు, ఇతర ప్రాంతాల్లో సెక్స్ లో పాల్గొనకుండా నిరొధించే ప్రచారాన్ని ప్రారంభించారు.
Bomb Blast: ఆఫ్రికా దేశం సోమాలియాలో భారీ బాంబు పేలుడు సంభవించింది. శనివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మొత్తం 27 మంది మరణించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. సోమాలియాలోని లోయర్ షాబెల్లె రీజియన్ లో ఘటన జరిగింది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. 53 మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. మురాలే గ్రామంలోని జనాలే ఏరియాలోని ఫుట్ బాట్ ఫీల్డ్ లో ఈ పేలుడు జరిగింది.