ఇండోనేషియా ఓపెన్ 2023: బ్యాడ్మింటన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సాత్విక్-చిరాగ్.. ఇండోనేషియా ఓపెన్ టైటిల్ మనదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండోనేషియా ఓపెన్ 2023: బ్యాడ్మింటన్‌లో సాత్విక్-చిరాగ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇండోనేషియా ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించారు. ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సాత్విక్-చిరాగ్ జోడి కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ విజృంభణతో వరుస గేమ్‌లలో మలేషియా జోడీని ఓడించారు. దీంతో సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు.
Read Also: Virat Kohli Net Worth: సంపాదనలోనూ ‘కింగే’.. విరాట్ కోహ్లీ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ఇప్పుడు బ్యాడ్మింటన్‌లో భారత అభిమానులకు ఇది పెద్ద వార్త అని చెప్పొచ్చు. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నమెంట్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకోగా. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్-చిరాగ్ 21-17, 21-18తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, వూయ్ యిక్ సోహ్ జోడీని ఓడించారు. ప్రపంచ ఛాంపియన్ జోడీపై సాత్విక్-చిరాగ్‌లకు ఇదే తొలి విజయం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో ర్యాంక్‌లో ఉన్న భారత జోడీ తొలిసారిగా సూపర్-1000 టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. సూపర్-1000 టైటిల్ గెలుచుకున్న తొలి భారత జోడీగా సాత్విక్-చిరాగ్ నిలిచారు. సెమీ-ఫైనల్‌లో సాత్విక్-చిరాగ్.. కొరియా జోడీ మిన్ హ్యూక్ కాంగ్-సెయుంగ్ జే సియోను 17-21 21-19 21-18 తేడాతో ఓడించి టైటిల్ మ్యాచ్‌లో ప్రవేశించారు. సాత్విక్-చిరాగ్ జంట ప్రపంచ ఛాంపియన్‌షిప్, థామస్ కప్ మరియు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలతో పాటు BWF టూర్‌లోని అన్ని స్థాయిలలో టైటిల్‌లను గెలుచుకుంది. సాత్విక్ మరియు చిరాగ్ ట్రోఫీ క్యాబినెట్‌లో ఒలింపిక్ పతకం మాత్రమే లేదు.
Read Also: Summer Effect: సూర్య ప్రతాపానికి మనుషులే కాదు.. రైలు పట్టాలు కూడా కరిగిపోతున్నాయి.. !
ఈ ఏడాది స్విస్ ఓపెన్ సూపర్ సిరీస్ 300 టోర్నమెంట్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. సాత్విక్-చిరాగ్ 2022 సంవత్సరంలో కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకంతో సహా 3 టైటిళ్లను గెలుచుకున్నారు. వీరిద్దరూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం కూడా సాధించారు. అయితే సాత్విక్ ఇటీవలి కాలంలో గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. అంతేకాకుండా ఫిబ్రవరిలో జరిగిన ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు దూరమయ్యాడు.
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!