Sidney: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో భారీ ఎత్తున మంటుల చెలరేగాయి. భారీ మంటల కారణంగా భవనం కుప్పకూలింది.
ఉత్తర ఇటలీని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వేలాది ఎకరాల వ్యవసాయ భూములు నీటమునిగాయి.
మే 9, 2022 ఘర్షణలకు సంబంధించి మాజీ ప్రధాని మహింద రాజపక్సేపై విధించిన విదేశీ ప్రయాణ నిషేధాన్ని శ్రీలంక కోర్టు బుధవారం ఎత్తివేసింది. రాజపక్సేతో పాటు, ఎంపీ రోహిత అబేగుణవర్దన, మంత్రి పవిత్ర వన్నియారాచ్చి, మాజీ ప్రావిన్షియల్ కౌన్సిల్ సభ్యురాలు కాంచన జయరత్నపై విధించిన ప్రయాణ నిషేధాన్ని ఫోర్ట్ మేజిస్ట్రేట్ కోర్టు కూడా పూర్తిగా ఎత్తివేసింది.
ఉత్తర మధ్య నైజీరియాలో అమాయక ప్రజలపై ముష్కరులు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 29 మంది మరణించారు. సమీపంలోని గ్రామాలపై తుపాకులతో జరిపిన భీకర కాల్పుల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు నైజీరియా అధికారులు వెల్లడించారు.
Uganda : నిన్న మొన్నటి వరకు అప్పు తీసుకున్న వాళ్ల పై వేధింపులు ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుతం అప్పు ఇవ్వడం కూడా పాపమైపోయింది. తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు అప్పు ఇచ్చిన వాళ్లపైనే దాడులు జరుగుతున్నాయి. అలాంటిదే ఉగాండాలో జరిగింది.
మెక్సికోలో జరిగిన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యాసింజర్ వ్యాన్, సరుకు రవాణా ట్రక్కు ఢీకొన్న ఘటనలో 26 మంది మరణించినట్లు ఉత్తర సరిహద్దు తమౌలిపాస్ రాష్ట్ర పోలీసులు ధ్రువీకరించారు.