తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఖరారు చేశారు అధికారులు. మే 22 నుంచి మే 29 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. జూన్ 3 నుంచి జూన్ 6 వరకు ప్రాక్టికల్స్ జరుగనున్నాయి. జూన్ 9, 10 తేదీల్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు,…
TS Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రథమ, ద్వితీయ ఫలితాలను విడుదల చేశారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
Inter students: చదువుకుంటూ మధ్యలో కాలేజీ మానేసిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫీజు వాపసు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే కళాశాలల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు కనీసం ఏడాదికి రెండుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ఎంసెట్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సర్కార్ వెల్లడించింది.
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల పాలిట నిమిషం నిబంధన శాపంగా మారింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం రోజే.. పలువురు విద్యార్థులకు తీవ్ర నిరాశ ఎదురైంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావడం ఆలస్యమైందని పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించలేదు అధికారులు. దీంతో తమను అనుమతించాలని విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత బ్రతిమిలాడిన పరీక్షా కేంద్రంలోకి అనుమతించక పోవడంతో.. విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. వేములవాడలో ఇద్దరిని, నిజామాబాద్‌లో 10 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించలేదు. దీంతో పలు…
ఏపీలో ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా పడ్డాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ నోటిఫికేషన్‌ను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఇంటర్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను…