TS EAMCET: ఎంసెట్ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తున్నట్లు సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం జీవో 18ని విడుదల చేశారు. ఇక నుంచి ఎంసెట్ మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్, మెడికల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీని అమలు చేస్తూ 2011లో అప్పటి ప్రభుత్వం జీవో 73ను జారీ చేసింది.
Read also: Firing: కరీంనగర్ లో కాల్పులు కలకలం.. జస్ట్ మిస్
ఎంసెట్ మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ వెయిటేజీ రద్దుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యా శాఖ, ఇంటర్ బోర్డుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. వెయిటేజీ రద్దుకు అందరూ సానుకూలంగా ఉన్నారు. కరోనా కారణంగా, ప్రభుత్వం గత రెండేళ్లుగా వెయిటేజీ నుండి మినహాయింపు ఇచ్చింది ఇప్పుడు దానిని శాశ్వతంగా ఎత్తివేసింది. ఇది ఇలా ఉండగా.. EAMCET 2023 యొక్క AM పరీక్ష మే 10 మరియు 11 తేదీలలో జరుగుతుంది. ఇంజనీరింగ్ పరీక్ష మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించానున్నారు. రెండు పరీక్షలు రెండు సెషన్లలో జరగునున్నాయి. అంటే, ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 వరకు నిర్వహిస్తారు.
DOUBLE DECKER BUS: హైదరాబాదీలకు డబల్ ధమాకా… ఆ బస్సుల్లో జర్నీ ఫ్రీ ఫ్రీ.