ఇంటర్ విద్యార్థులు భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటర్మీడియట్ పరీక్షలకు విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు, తల్లిదండ్రులకు ఉందన్నారు. పరీక్షలపై స్టూడెంట్స్ కు ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృతి చేసి వారిలో ధైర్యాన్ని నింపాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి కోరారు.
Also Read : Arrest : కార్పోరేటర్‌ను చంపిందెవరో తెలిసింది.. అదే కారణం
రాష్ట్రంలో మార్చి 15 నుంచి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితా తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ ఛైర్మన్లుగా కలెక్టర్లు బాధ్యతతో వ్యవహరించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అసవరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ పరీక్షలకు 9 లక్షల 47 వేల 699 మంది విద్యార్థులు హాజరవబోతున్నట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.
Also Read : Divyabharathi: ‘బ్యాచిలర్’ బ్యూటీ.. తన ఎత్తుపల్లాలను చూసుకోమని వదిలేసిందే
జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రతలతో పాటు స్టూడెంట్స్ కు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షకేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్సమ్స్ సమర్థవంతంగా.. పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.