దీపావళి పండగ రోజు టపాకాయలు కాల్చి ఎంజాయ్ చేస్తుంటారు. పెద్దవాళ్లు కూడా చిన్న పిల్లల్లా మారి బాణసంచా కాలుస్తుంటారు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులను బ్రతిమిలాడుకుని మరి టపాసులు కొనుక్కొచ్చుకుని కాలుస్తుంటారు. అయితే ఈ బాణసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చేతిలో పేలడం, కళ్లల్లో పడడంతో గాయాలపాలవుతున్నారు. ఏటా దీపాల పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి…
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చోసిటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ విధ్వంసం సృష్టించింది. ఈ విపత్తులో ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 160 మంది గాయపడ్డారు. 220 మందికి పైగా ఇప్పటికీ కనిపించడం లేదు. మృతుల్లో ఇద్దరు CISF జవాన్లు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అమిత్ షాకు పరిస్థితి గురించి తెలియజేశారు. శిథిలాల కింద లేదా ప్రమాదంలో చిక్కుకున్న ప్రతి ప్రాణాన్ని కాపాడటానికి సహాయ సిబ్బంది గంటల తరబడి కష్టపడి పనిచేస్తున్నారు. సహాయ…
షూటింగ్‌లో హీరోహీరోయిన్ లకు చిన్న చిన్న గాయలు సహజం. కానీ ఒక్కోసారి తీవ్రంగా కూడా తగులుతాయి. అలా ఇప్పటికే చాలా మంది హీరోలు ప్రాణాలతో బయటపడ్డారు. ఇందులో భాగంగా తాజాగా నటి రాశి ఖన్నా ఒక సినిమా షూటింగ్‌లో గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. షూటింగ్ జరుగుతుండగా జరిగిన ఈ ఘటనలో ఆమె ముఖానికి, అలాగే చేతులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక గాయలకు సంబంధించి కొన్ని…
చైనాలోని కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలో పొగలు పెద్ద ఎత్తున వ్యాపించాయి.
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో చివరి టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరుగుతోంది. తొలి రెండు సెషన్లలో టీమిండియా 4 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషబ్ పంత్‌తో పాటు రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. అయితే.. సిడ్నీ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పిచ్ భారత బ్యాటర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలో రిషబ్ పంత్ చేతికి గాయం అయింది.
హైదరాబాద్‌లోని పాతబస్తీ, మదన్నపేట, ఉప్పర్ గూడాకి చెందిన అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడింది. శబరిమలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎరుమెలి నుండి పంపా నది శబరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రియాసి జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో 10 నెలల బాలుడితో సహా ముగ్గురు మృతి చెందారు. కొండ రహదారిపై నుంచి వెళ్తుండగా కారు ప్రమాదవశాత్తు లోతైన లోయలో పడిపోయింది. దీంతో.. ఒక మహిళ, ఆమె 10 నెలల కొడుకుతో సహా ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
బ్యాంకాక్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు సజీవదహనం అయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు అరటి తోటలో పనికి వెళ్ళారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు వారిపై పిడుగు పడింది. దీంతో.. పిడుగుపాటుకు గురై సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (19) ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.