తమిళ హీరో విశాల్ ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ సినిమా షూటింగ్ లో మరోసారి గాయపడ్డాడు. ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్న సమయంలో ఆయన గోడను ఢీకొని పడిపోవడంతో తీవ్ర గాయమైంది. దీంతో విశాల్ వెన్ను భాగానికి దెబ్బతగిలింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స చేస్తున్నారని, విశాల్ ఆరోగ్యంగానే ఉన్నారని టీమ్ సభ్యులు తెలిపారు. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో విశాల్ గాయపడడం ఇది రెండోసారి. ఇదివరకు…
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ షూటింగ్ లో గాయపడింది. “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” షూటింగ్‌లో ఓ నటుడు గన్ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి తగిలడంతో రక్తం కారింది. ఈ యాక్షన్ సన్నివేశంలో ఆమె డూప్ లేకుండా చేయడంతో గాయాలు అయ్యాయి. అయితే తన గాయాన్ని అలాగే భరిస్తూ కారుతున్న రక్తంతోనే షూటింగ్‌లో పాల్గొందట. దీంతో ఆ సీన్ మేకప్ లేకుండానే చాలా సహజంగా వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ యాక్షన్ సన్నివేశాన్ని…