వినాయక నిమజ్జనంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శోభాయాత్రలో ఆడిపాడుతున్నారు. ఇంతలో అనుకోని సంఘటన జరిగింది. గణేష్ శోభాయాత్ర వాహనంలో ఉంచిన బాణాసంచా ఒక్కసారిగా పేలింది. ఏం జరిగిందో అర్థమయ్యే లోపు డ్యాన్స్ చేస్తున్న వారు గాయాలతో పడి ఉన్నారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
Nalgonda : నల్గొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్‌లో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దేవరకొండలోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో రెండు రోజుల క్రితం జరిగింది.
మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఆదివారం ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి. కర్ణాటకలోని బెళగావి ఏవియేషన్ అకాడమీకి చెందిన సెస్నా 152 ఎయిర్ క్రాఫ్ట్ గా గుర్తించారు. కాగా.. ఇంజిన్ ఫెయిల్ అవడంతో ఈ ఘటన జరిగింది.
Road Accident : దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గౌటెంగ్ ప్రావిన్స్‌లోని మెరాఫాంగ్ స్థానిక మునిసిపాలిటీలో బుధవారం ఉదయం మినీబస్సు, ట్రక్కు ఢీకొనడంతో 12 మంది విద్యార్థులతో సహా 13 మంది మరణించారు.
ఎంఐఎం పార్టీ నేతపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఓ పెట్రోల్ పంపు సమీపంలో మాలెగావ్ మాజీ మేయర్ అబ్దుల్ మాలిక్‌పై కాల్పులకు పాల్పడ్డారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీకి మాలిక్ ప్రముఖ నాయకుడిగా ఉన్నారు.
ఒడిశాలో మావోయిస్టులు-భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒడిశా పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సభ్యుడికి గాయాలయ్యాయి. గరియాబంద్ జిల్లా చివరిలో ఉన్న కొమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని సునాబేడా అభయారణ్యంలో అర్థరాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో క్రాస్ ఫైరింగ్‌లో సైనికుడి మెడపై కాల్పులు జరిగాయి. దీంతో.. జవాన్ కు తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే అతన్ని గరియాబంద్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం సైనికుడిని…
Afghanistan Flood : ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల కారణంగా 84 మంది మరణించారు. ఈ మేరకు తాలిబన్ అధికార ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.