పంజాబ్ ముక్త్‌సర్‌లోని గిద్దర్‌బాహాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన చోటు చేసుకుంది. డేరా సిద్ధ్ బాబా గంగా రామ్ వార్షికోత్సవ కార్యక్రమంలో సిలిండర్ పేలడంతో ఏడుగురు సేవకులకు మంటలు అంటుకున్నాయి. కాగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో బటిండాకు రెఫర్ చేశారు. భటిండాకు రెఫర్ చేసిన వారిలో ముగ్గురికి 60-70 శాతం కాలిన గాయాలయ్యాయి. మరోవైపు పేలుడు శబ్ధం విని ఒక్కసారిగా భక్తులు భయాందోళనకు గురయ్యారు.
స్కూల్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు చిన్నారులకు గాయాలైన ఘటన బీహార్ లోని సరన్ జిల్లాలో జరిగింది. బనియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దధిబాధి గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో సుమారు అర డజను మంది పిల్లలు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అక్కడి స్థానికులు.. పిల్లలందరినీ బస్సులో నుంచి క్షేమంగా కిందకు దించారు. గాయాలైన పిల్లలను వెంటనే బనియాపూర్ రిఫరల్ ఆసుపత్రిలో…
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక వర్గం మరో వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
Odisha : ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బస్సు ఫ్లై ఓవర్‌పై నుంచి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యను జాజ్‌పూర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ధృవీకరించారు.
South Africa: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు ఓ బస్సు లోయలో పడింది. వంతన పై నుంచి అదుపు తప్పి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు.
Fire In Temple: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది. గర్భగుడిలో హోలీ రోజున జరిగే భస్మ హారతి సందర్భంగా గులాల్ ఊదడంతో మంటలు వ్యాపించడంతో పాటు 13 మంది కాలి బూడిదయ్యారు.
Rajasthan Blast : రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు సజీవ దహనం అయ్యారు. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
CPI Narayana: సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే.నారాయణ స్వల్ప అనారోగ్యాన్ని గురయ్యారు. ఆయనకు పరిశీలించిన ఏఐజి డాక్టర్లు రెండు వారాలపాటు విశ్రాంతి అవసరమని సూచించారు.
ములుగు జిల్లా మల్లంపల్లి మండలం మహ్మద్ గౌస్ పల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. గాయపడిన వారిని ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మేడారం జాతరకు ట్రాక్టర్ లో 8 మంది వెళ్తున్నారు. అయితే మహ్మద్ గౌస్ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు.. వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న 8 మందికి…
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు..నితిన్ తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఏపీ లోని మారేడుమిల్లి అడవులకు వెళ్లారు.. అక్కడ భారీ యాక్షన్ సన్నీ వేశాలు జరుగుతున్న సమయంలో అతనికి గాయాలు అయినట్లు తెలుస్తుంది.. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేశారు. నితిన్ చేతికి గాయాలు…