Indonesia : ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 19 మంది మరణించారు. ఏడుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
విమానంలో ఇద్దరు పైలట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకేసారి ఇద్దరు నిద్ర పోవడంతో విమానం దారి తప్పింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇద్దరిపై అధికారులు వేటు వేశారు.
Indonesia Footballer Dies after hit by lightning: ఇండోనేషియాలో కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఓ క్రీడాకారుడు మృతి చెందాడు. వెస్ట్ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో ఈ విదారకమైన సంఘటన జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అందరూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. వివరాల ప్రకారం.. ఎఫ్‌బీఐ సబంగ్, బాండుంగ్…
America: ప్రస్తుతం డబ్బు ప్రపంచాన్ని శాసిస్తోంది. దాని కోసం రక్త సంబంధాలను కూడా మర్చిపోతున్నారు. అలాంటిదే ఓ కూతురు తన తల్లిని డబ్బు కోసం చంపిన ఉదంతం అమెరికా నుంచి వెలుగులోకి వచ్చింది.
Indonesia Earthquake: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఈ భూకంపం 80 కి.మీ లోతులో సంభవించిందని ఎన్‌సీఎస్ పేర్కొంది. ఈ భూకంపం ద్వారా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఇండోనేషియాలో తరచుగా భూకంపాలు వస్తాయన్న విషయం తెలిసిందే. Also Read: INDW vs AUSW: నేడే భారత్,…
Rohingya refugees: మయన్మార్‌లో హింసకు గురవుతున్న రోహింగ్యాలు బంగ్లాదేశ్, భారత్ వంటి దేశాలకు వెళ్తున్నారు. అయితే వీరి వల్ల బంగ్లాదేశ్‌లో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే ఇండోనేషియాకు వచ్చిన 250 మంది రోహింగ్యా శరణార్థులను స్థానికులు వెనక్కి తిప్పిపంపించారు. రోహింగ్యాలు ఒక చెక్క పడవలో ఇండోనేషియా దక్షిణ ప్రాంతంలోని అచే ప్రావిన్సు తీరానికి చేరుకున్నారు. అయితే కోపంతో ఉన్న స్థానికులు వారిని పడవ దిగొద్దని హెచ్చరించారు. కొంతమంది శరణార్థులు…
Earthquake: వరసగా భారీ భూకంపాలతో ద్వీపదేశం ఇండోనేషియా వణికిపోతోంది. తాజాగా బుధవారం రాత్రి 8.02 గంటలకు మరోసారి శక్తివంతమైన భూకంపం వచ్చింది. 6.7 తీవ్రతతో బండా సముద్రంలో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టాల గురించిన వివరాలు తెలియలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
ప్రధాని మోడీ బుధవారం ఇండోనేషియా పర్యటనకు వెళ్లారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగే ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు జకార్తా వెళ్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ప్రధాని మోడీ సెప్టెంబర్ 7న ఇండోనేషియాలో పర్యటించనున్నారు. జకార్తాలో జరుగనున్న 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు.
Indonesia EarthQuake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇండోనేషియాలోని మాతరాంకు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా భూ అంతర్భాగంలో…