Indonesia Footballer Dies after hit by lightning: ఇండోనేషియాలో కనీవినీ ఎరుగని విషాదం చోటుచేసుకుంది. మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఓ క్రీడాకారుడు మృతి చెందాడు. వెస్ట్ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో ఈ విదారకమైన సంఘటన జరిగింది. ఆదివారం (ఫిబ్రవరి 11) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అందరూ కన్నీటిపర్యంతం అవుతున్నారు.
వివరాల ప్రకారం.. ఎఫ్‌బీఐ సబంగ్, బాండుంగ్ ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. గోల్ కొట్టేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా తలపడుతున్నారు. ఈ సమయంలో మైదానంలో ఉన్న సబంగ్ ఆటగాడిపై పిడుగు పడింది. వెంటనే అతడు మైదానంలో కుప్పకూలిపోయాడు. ఈ ఊహించని సంఘటనతో మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లు షాక్‌కు గురయ్యారు. ఓ ప్లేయర్ అతడి వద్దకు వెళ్లి పరిశీలించి.. మైదానంలోకి వారాలని సిబ్బందికి సైగలు చేశాడు.
Also Read: Farmers Protest: రైతుల ఆందోళన.. ఢిల్లీలో మార్చి 12 వరకు 144 సెక్షన్!
వెంటనే స్టేడియంలోని సిబ్బంది అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ ఫుట్‌బాలర్ ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు చెప్పారు. సంఘటన జరిగిన తర్వాత ఆ ఫుట్‌బాలర్ ఊపిరి పీల్చుకుంటున్నాడని, ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించాడని ఇండోనేషియా మీడియా పేర్కొంది. ఈ ఘటన అతడి సహచరులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫుట్‌బాల్ అభిమానులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు 34 ఏళ్లు అని తెలుస్తోంది.
This happened during a football match in Indonesia 🇮🇩 pic.twitter.com/JHdzafaUpV
— Githii (@githii) February 11, 2024