Flight: నిద్రలోకి జారుకున్న పైలట్లు.. ప్లైట్ మిస్సింగ్! తప్పిన ముప్పు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానంలో ఇద్దరు పైలట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఒకేసారి ఇద్దరు నిద్ర పోవడంతో విమానం దారి తప్పింది. ఈ ఘటన ఇండోనేషియాలో చోటుచేసుకుంది. ఇద్దరిపై అధికారులు వేటు వేశారు.
దాదాపు అరగంట తర్వాత ప్రధాన పైలట్ మేల్కొని వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు ఇండోనేషియా రవాణా శాఖ తాజాగా వెల్లడించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు పైలట్లపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది.
Also Read
బాతిక్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానం నలుగురు సిబ్బంది, 153 మంది ప్రయాణికులతో సౌత్ ఈస్ట్ సులవేసి నుంచి దేశ రాజధాని జకర్తాకు పయనమైంది. కొద్దిసేపటికి కోపైలట్ అనుమతితో ప్రధాన పైలట్ నిద్రపోయాడు. విమానాన్ని నియంత్రణలోకి తీసుకున్న కోపైలట్ సైతం కూడా కొద్దిసేపటికే నిద్రలోకి జారుకున్నాడు. దీంతో వారిని సంప్రదించేందుకు జకర్తాలోని కంట్రోల్ సెంటర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
ఇద్దరు పైలట్లు నిద్రలోకి జారుకున్న 28 నిమిషాల తర్వాత మేల్కొన్న కెప్టెన్.. సహచర పైలట్ కూడా నిద్రపోతున్నాడని.. తాము నిర్ణీత మార్గంలో వెళ్లడం లేదని గుర్తించాడు. వెంటనే అతడిని నిద్ర లేపి, కంట్రోల్ సెంటర్ కాల్స్‌కు స్పందించాడు. ఈ క్రమంలోనే విమానాన్ని సరైన మార్గంలో పెట్టి.. జకర్తాలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
జనవరి 25న జరిగిన ఈ ఘటనను రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై విచారణ చేపడతామని, స్థానికంగా అన్ని విమాన సేవల నిర్వహణ తీరును సమీక్షిస్తామని ఇండోనేషియా రవాణా శాఖ ప్రకటించింది.
ఇటీవల పలు దేశాల్లో విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనికి ప్రధానంగా పైలట్ల నిర్లక్ష్యమే కారణంగా జరుగుతున్నాయని నివేదికల్లో తేలుతున్నాయి. అయినా కూడా మొద్ద నిద్ర వీడడం లేదు. తాజా ఘటన తెలిసిన ప్రయాణికులు పెద్ద ప్రమాదం నుంచి బయటపడినట్లుగా వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక శుక్రవారం కూడా అమెరికాలో పెను విమాన ప్రమాదం తప్పింది. విమానం టేకాప్ అయిన కొద్ది సేపటికే టైరు ఊడి కిందపడింది. దీంతో పార్కింగ్‌లో ఉన్న కారు మీద పడడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!