ఇండోనేషియాలో మరోసారి ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. గతేడాది నవంబర్‌లో వచ్చిన వరదలతో అతలాకుతలం అయింది. అప్పట్లో 1,000 మంది వరకు చనిపోయారు. తాజాగా సోమవారం కూడా మరోసారి ఉత్తర సులవేసిలో ఆకస్మిక వరదలు సంభవించాయి.
ఇండోనేషియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సులవేసి ద్వీపంలోని ఒక వృద్ధాశ్రమంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 మంది సజీవదహనం అయ్యారు. ఉత్తర సులవేసి ప్రావిన్షియల్ రాజధాని మనాడోలోని నర్సింగ్ హోమ్‌లో ఆదివారం రాత్రి 8:31 గంటలకు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేటప్పటికీ మంటలు ఎగిసిపడ్డాయి. తిప్పించుకునే మార్గం లేక అగ్నికీ ఆహుతియ్యారు. ఇది కూడా చదవండి: Supreme Court: ఆరావళి మైనింగ్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్రానికి.. రాష్ట్రాలకు నోటీసులు 16 మంది…
ఇండోనేషియాలోని జావాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున బస్సు కాంక్రీట్ దిమ్మను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Fire Accident: ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం నాడు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ భవనం టెర్రా డ్రోన్ ఇండోనేషియా (Terra Drone Indonesia) కార్యాలయం. ఈ సంస్థ మైనింగ్ నుంచి వ్యవసాయ రంగం వరకు వివిధ క్లయింట్‌లకు ఏరియల్ సర్వే కార్యకలాపాల కోసం డ్రోన్‌లను అందిస్తుంది. IndiGo: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం..: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ ఘటనకు సంబంధించి…
ఇండోనేషియాను భారీ భూకంపం హడలెత్తించింది. సుమత్రా ద్వీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. సునామీ వచ్చే అవకాశం లేదని జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.
BrahMos missile: బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొనుగోలుకు సంబంధించి భారత్-ఇండోనేషియా మధ్య ప్రధాన రక్షణ ఒప్పందాలను ఖరారు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. రష్యా నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య వివిధ స్థాయిల్లో చర్చలు జరిగాయి.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం సులవేసి ఉత్తర తీరంలో భూకంపం సంభవించిందని ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) తెలిపింది.
UNGA: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాల్లో ఉక్రెయిన్ యుద్ధం, గాజా యుద్ధం ముఖ్యాంశాలుగా నిలిచాయి. ప్రపంచ దేశాధినేతలు ముఖ్యంగా ఈ రెండింటిపైనే ప్రసంగించారు. అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఇచ్చిన ప్రసంసం వైరల్‌గా మారింది. ఈ యుద్ధాల ముగిసి ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆయన అన్ని మతాల్లో దేవుడిని ప్రార్థించారు.
రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో తీవ్రత 7.8గా.. ఇండోనేషియాలో 6.1గా తీవ్రత నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున రష్యాలోని కమ్చట్కాలో భూ కంపం సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇండోనేసియాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం తనింబర్ దీవుల ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం క్రింద 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లుగా జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) తెలిపింది.