ప్రధాని మోడీ సెప్టెంబర్ 7న ఇండోనేషియాలో పర్యటించనున్నారు. జకార్తాలో జరుగనున్న 20వ ఆసియాన్-ఇండియా సమ్మిట్ మరియు 18వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొననున్నారు.
Indonesia EarthQuake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇండోనేషియాలోని మాతరాంకు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా భూ అంతర్భాగంలో…
మిస్ ఇండోనేషియా యూనివర్స్ పోటీకి చెందిన ఆరుగురు పోటీదారులు నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోటీ సమయంలో తాము టాప్‌లెస్ 'బాడీ చెక్'లకు గురయ్యామని పోటీదారులు ఆరోపించారు.
ఇండోనేషియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సులవేసి ద్వీపంలో ప్రమాదవశాత్తు పడవ మునిగి 15 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతైనట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. మొత్తం ఆ పడవలో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అందులో 19 మంది గల్లంతయ్యారనీ, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
Earthquake : ఇండోనేసియాను వరుస భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఉదయం ఇండోనేసియాలోని కెపులౌన్ బటులో వరుసగా రెండుసార్లు భూమి కంపించింది. మొదట కంపించినప్పడు భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటేరియన్ సీస్మోలజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
ఇండోనేషియాలో మరోసారి భారీ భూ కంపం సంభవించింది. జావా ద్వీపానికి ఉత్తరాన సముద్రంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) శుక్రవారం ప్రకటించింది.
Indonesia's Merapi Volcano Erupts: ఇండోనేషియాలో మెరాపి అగ్నిపర్వతం శనివారం బద్దలైంది. దీని ప్రభావంతో ఏడు కిలోమీటర్ల మేర ధూళి మేఘాలు కమ్ముకున్నాయని ఆ దేశా వివత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇండోనేషియాలోని యొగ్యకర్తా ప్రాంతంలో ఉన్న మెరాపి అగ్నిపర్వతం స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు విస్పోటనం చెందింది. 1.5 కిలోమీటర్ల మేర లావా ప్రవాహాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం నుంచి మూడు నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల కార్యకలాపాలు నిలిపివేయాలని…