ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా భారత్ లో క్రికెట్ సందడి నెలకొంది. అయితే ఈ సీజన్ లో బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. ఎంతటి అనుభవజ్ఞ బౌలర్ అయిన సరే తగ్గేదే లేదు అంటూ బ్యాటర్స్ రెచ్చిపోతున్నారు. బాలు వేస్తే చాలు.. బాల్ బౌండరీ లైన్ అవతలపడేలా వీర బాదుడు బాధపడుతున్నారు. ఒకవైపు ఇలా ఉంటే టి20 క్రికెట్ చరిత్రలోనే సంచలనం నమోదయింది. ఇక ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Also Read: Gyanvapi: జ్ఞానవాపీ మసీదు సర్వేకి ఆదేశించిన జడ్జికి బెదిరింపు కాల్స్..
టి20 క్రికెట్ లో తాజాగా ఓ పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20 మ్యాచ్ ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో ఇండోనేషియా జట్టు బౌలర్ ‘రొహ్మాలియా’ ఒక్క పరుగు ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. ఈ దెబ్బతో అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో పురుషులు, మహిళలలో కూడా ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు ఇప్పటివరకు నమోదు కాలేదు.
Also Read: Butterfly Pea Ghee Rice: ఏంటి భయ్యా ఇది.. ‘గీ రైస్’ ను ఇలా కూడా చేస్తారా.. వీడియో వైరల్..
ఇప్పటి వరకు పురుషుల క్రికెట్ లో స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు ఉండగా.. మహిళల క్రికెట్ లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డుము నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లో ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన రికార్డ్స్ లేవు. రొహ్మాలియా తన కెరీర్ లోనే తన రెండో టీ20 మ్యాచ్ లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలను నమోదు చేసింది. ఇక ఆ మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్ గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడగా.. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇక 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) దెబ్బకి 16.2 ఓవర్లలో కేవలం 24 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ దెబ్బకి మంగోలియా ఇన్నింగ్స్ లో ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్ తాకలేకపోగా.. ఎక్స్ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం ఇక్కడ విశేషం.